టాక్సీ చెల్లించకుంటే బండ్లు లోపలేసుడే!. ఎం వి ఐ భీమ్ సింగ్..
దర్వాజ,గోదావరి ఖని:……..సరుకు రవాణా జరిపే వాహన యజమానులు త్రై మాసిక టాక్సీలను వెంటనే చెల్లించాలని ,లేనిచో తనిఖీలు జరిపి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని, రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీమ్ సింగ్ తెలిపారు.మంగళవారం రోజున ఎన్టిపిసి రాజీవ్ రహదారి తో పాటు పలు ఏరియాలలో టాక్సీ చెల్లించని వాటిని తనిఖీ చేసి 30 వాహనాలను సీజ్ చేశామని అన్నారు. సరుకు రవాణా చేసి హెవీ ,మీడియము, లైట్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు గత కొంతకాలం నుండి చెల్లించాల్సిన త్రైమాసిక టాక్సిలను చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, అన్నారు అత్యధికంగా టాక్సీ చెల్లించని లారీలు, డీసీఎం ,టాటా ఏసీ, బొలెరో.బోలారే వాహన యజమానులు సకాలంలో టాక్సీ చెల్లిస్తే పెనాల్టీపై 50 శాతం మాఫీ చేయడం జరుగుతుందని అన్నారు, లేనిచో పట్టుకొని సీజ్ చేసి 200. శాతం పెనాల్టీ వేయడం జరుగుతుంది హెచ్చరించారు. అదేవిధంగా దళిత బంధు ద్వారా ట్రాన్స్పోర్ట్ వాహనాలు పొందిన వారు కూడా త్రై మాసిక టాక్సీ చెల్లించి సహకరించాలని కోరారు…….