ఢిల్లీ గ్రీన్ అవార్డు కార్యక్రమానికి రామగుండం నగర మేయర్!

రామగుండం నగర మేయర్ డా. బంగి అనిల్ కుమార్ శనివారం న్యూ ఢిల్లీ ప్రగతి మైదాన్ లో లో నిర్వహించిన వరల్డ్ ఎన్విరాన్మెంట్ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు . ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఆల్ ఇండియా మేయర్స్ కౌన్సిల్ ఇతర సంస్థలతో కలిసి జూన్ 4, 5 తేదీలలో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్ లో గ్రీన్ అవార్డ్స్ – 2022 అందజేశారు. ఈ సంధర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి రామగుండం నగర మేయర్ ను ఆహ్వానించారు. రామగుండం నగర పాలక సంస్థ ఆద్వర్యంలో అమలవుతున్న పర్యావరణ హిత కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో ఆయన వివరించారు.

మూడు చక్రాల సైకిల్ స్థానాలో ఆటో ట్రాలీ లను ప్రవేశ పెట్టడం , వంద శాతం ఇంటింటి నుండి చెత్త సేకరణ, ఘన వ్యర్ధ పదార్థాల నిర్వహణ , తడి చెత్త నుండి కంపోస్ట్ తయారీ , డ్రై రిసోర్స్ సెంటర్స్ , ఆధునిక యంత్రాలతో చెత్త సేకరణ తదితర అంశాలను ఈ సంధర్భంగా ఆయన ప్రస్తావించారు. స్వచ్చ సర్వే క్షన్ – 2021 లో 211 ర్యాంక్ ఉన్న రామగుండం నగరాన్ని 92 వ ర్యాంక్ కు తీసుకు రావడానికి రామగుండం నగర పాలక సంస్థ చేసిన కృషి వివరించారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *