సింగరేణి కార్మికుల రెక్కల కష్టాన్ని పట్టించుకోని ప్రభుత్వాలు….

దర్వాజ, గోదావరి ఖని:…….జేబీసీసీఐ వేతన కమిటీ సమావేశాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని బిఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు.మంగళవారం సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంస్ రామగుండం ఏరియా1, లో ధర్నా నిర్వహించారు.అనంతరం…..అధ్యక్షులు యాదగిరి సత్తయ్య పాల్గొని మాట్లాడుతూ…11వ వేతన ఒప్పందం, 19%శాతం ఎంజీబి, కనీస వేతన పెరుగుదల, మెరుగైన వేతన ఒప్పందం,19% శాతం మినిమం గ్యారెంటెడ్ బెనిఫిట్ సాధించడం చారిత్రాత్మకమైన పరిణామని,నిరంతరం అవిశ్రాంతమైన భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ నాయకులు బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ జెబిసిసి సభ్యులు… కొత్త కాపు లక్ష్మారెడ్డి కృషి ఫలితంగా సాధించామని బొగ్గు గని కార్మికుల విజయమని,కోల్ ఇండియా,సింగరేణి యాజమాన్యాలు తదుపరి సమావేశం ఏర్పాటు కు మొండిగా వ్యవహరిస్తున్నాయని ,బొగ్గు గనుల పైన ద్వార సమావేశాలు నిర్వహిస్తు,కార్మికులు చైతన్య పరుస్తున్నామని, ఫిబ్రవరి 21 తారీఖున సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని,19శాతం కనీస పెరుగుదల కార్మికులకు క్యాటగిరి-1 బేసిక్ రూ.1011.27 నుండి 1502.67 వేతన పెరుగుదల రూ.6973.73, ఏ 1 కార్మికుడి వేతనం రూ.47,802.53 బేసిక్ నుండి 71030.57 బేసిక్ పెరిగి కనీస వేతనం పెరుగుదల రు.12,678.69 పెరిగిందని తెలిపారు.తదుపరి ఒక సమావేశం ఏర్పాటు చేయాలని పూర్తిస్థాయిలో వేతన ఒప్పందం చేయాలని చూస్తున్న తరుణంలో మొండిగా ఉన్న కోలిండియా, సింగరేణి యాజమాన్యాలు దిగివచ్చేలా ఈనెల 21వ తారీఖున అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చినారు బేసిక్ పై ఆధారపడి పెరిగే అండర్ గ్రౌండ్ అలవెన్సులు, 4%స్పెషల్ అలవెన్స్ హెచ్ఆర్ఏలు పెరగనున్నాయని, అలవెన్సులు ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ, నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఇతర అలవెన్సులు కూడా తదుపరి సమావేశంలో చర్చించనున్నారని ఆయన తెలియజేశారు గత వేతన ఒప్పందంలో మాదిరిగా మెడికల్ స్కీం,పెన్షన్,క్యాడర్ స్కీం,రిటైర్ మెంట్ బెనిఫిట్స్, త్వరలో జరుగు జేబిసిసిఐ సమావేశంలో చర్చించి త్వరలోనే పరిష్కారం చేయనున్నట్లు తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా బలమైన కార్మిక సంఘముగా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ బలోపేతం అవుతున్నదని జాతీయ భావాలు క్రమశిక్షణ కలిగిన దేశభక్తి కలిగిన కార్మిక సంఘం సంస్థ పరిరక్షణ కొరకు కార్మిక హక్కుల సంరక్షణ కొరకు పనిచేస్తుందని తెలిపారు……

నాయకులు ఆకుల హరీణ్,సాయవేణి సతీష్ మాదాస్ రవీందర్,పెండం సత్యనారాయణ, బోడకుంట రాజేశం, తాట్ల లక్ష్మయ్య, పల్లె శ్రీనివాస్, పోతరాజు భాస్కర్, పెంచాల వెంకటస్వామి, సంగాని సాంబయ్య, నీలం శ్రీనివాస్, సల్వాజి మనోహర్రావు, ఎడ్ల వెంకట్ రెడ్డి, గుండబోయిన భూమయ్య, నర్సింహులు, పోరండ్ల వెంకటేష్, బైర శ్రీనివాస్, ఎర్రబెల్లి రమేష్, నరసింహులు, వంగల తిరుపతి, సార్ల తిరుపతి, ముసుకుల భాస్కర్ రెడ్డి, రంజిత్ కుమార్, బిమునిపల్లి నారాయణ, నీలం శ్రీనివాస్, బి రాజు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు . …..

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *