క్షమించమని అడుగుతా!

భవిష్యత్తు తెలిసిందో ఏమో ఆ ఎమ్మెల్సీ బేరానికి వచ్చాడు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఓ వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే రుచి తగలడం మానదు అనేదానికి ఇదే నిదర్శనం….తెలంగాణ గవర్నర్ తమిళిసై పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. తాను చేసిన వ్యాఖ్యలపై కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. ఇన్నాళ్లు తన వ్యాఖ్యలను సమర్ధించుకున్న కౌశిక్ రెడ్డి ఇప్పుడు తన తప్పును ఒప్పుకున్నారు. గవర్నర్‭ను క్షమాపణలు కోరుతూ లిఖితపూర్వకంగా లేఖ రాయనున్నట్లు తెలిపారు. గతంలో కూడా కౌశిక్ రెడ్డి తమిళిసైపై ఎన్నోసార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై జాతీయ మహిళా మోర్చా ఇచ్చిన ఫిర్యాదును జాతీయ మహిళా కమిషన్ స్వీకరించింది. వివరణ ఇవ్వాలంటూ కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *