బిఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్ !!

దర్వాజ ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దీటి బాలరాజ్గోదావరిఖని/బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు దీటి బాలరాజ్ , ఉల్లంగుల రమేష్, ప్రభాకర్, క్రిష్ణస్వామి, కుమార్, ఖదీర్ మరియు టిబిజికెఎస్ యునియాన్ నాయకుడు ఐ రాజేశం రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోని పార్టీలో చేరారు..ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ… రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని, కలిసి పోరాటం చేద్దామని పూర్వా వైభవం తీసుకొచ్చి దోపిడీని అరిగడదామని కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక శాసన సభ్యుని పనులు ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. ప్రజలు, విద్యార్థులు, యువకులు ,మహిళలు, కార్మికులు బయటికి వచ్చి నన్ను ఆశీర్వదించాలని, గెలిపించాలని కోరారు.దీటి బాలరాజ్, ఉల్లంగుల రమేశ్ మాట్లాడుతూ… బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్సి, బిసి, ఎస్టి, మైనారిటీలకు పూర్తిగా అన్యాయం జరిగిందని వారి పాలన నచ్చక ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరానని, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి రుణం తీర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీలో చేరామని, రామగుండంలో రాజ్ ఠాకూర్ ని గెలిపించుకుంటామని అన్నారు.ఈ చేరికల కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు……..

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *