అనారోగ్య బాధితులకు కొండంత అండ!
తెలంగాణ రాష్ట్రంలోని పేద అనారోగ్య బాధితులకు కొండంత అండగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు నిలుస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముప్పై మంది సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎనిమిదిలక్షల ఇరవై ఆరు వేల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… అనారోగ్యాలకు గురై ప్రైవేట్ ఆస్పత్రిల్లో చికిత్స చేయించున్న తర్వాత సిఎం సహాయనిధి ద్వారా తిరిగి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందన్నారు. అనారోగ్య బాధితులకు సి.ఎం సహాయనిధి ద్వారా అర్దిక భరోసా అందిస్తున్నమన్నారు. రామగుండం నియోజకవర్గం లో పేద వారికి అండగా నిలుస్తున్నమన్నారు.
ఈ కార్యక్రమం లో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు జడ్పీటీసి అముల నారాయణ వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి మహేందర్ రెడ్డి కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్ ఇంజపురి పులిందర్ మేకల సదానందం శంకర్ నాయక్ సర్పంచ్ లు ధరని రాజేష్ ధర్మాజీ కృష్ణ గుమ్ముల రవీందర్ కొల లత శ్రీనివాస్ నాయకులు అడ్డాల రామస్వామి బొడ్డు రవీందర్ దీటి బాలరాజు నారాయణదాసు మారుతి తోడేటి శంకర్గౌడ్ పర్లపల్లి రవి బొడ్డుపల్లి శ్రీనివాస్ మండ రమేష్ నూతి తిరుపతి మెతుకు దేవరాజ్ మేడి సదయ్య గడ్డి కనుకయ్య తో కల రమేష్ పిల్లి రమేష్ యాసర్ల తిమెతి నీల గణేష్ బెంధే నాగభూషణం చిలుముల విజయ్ మేకల పొశంమైస రాజేష్ తదితరులు పాల్గొన్నారు