“దుద్దిళ్లకు” హైకోర్టులో ఊరట!!!

ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై నమోదైన కేసులో హైకోర్టు స్టే..తదుపరి చర్యలను నిలిపివేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనంపెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్‌ పరిధి మంథని పోలీస్‌ స్టేషన్‌లో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై నమోదైన కేసులో విచారణపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి చర్యలను నిలిపివేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్‌ పరిధి మంథని పోలీస్‌ స్టేషన్‌లో అక్టోబర్‌ 20న నమోదైన కేసును కొట్టివేయాలంటూ స్థానిక ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ‘బీఆర్‌ఎస్‌ నాయకుడు పుట్టా మధుకర్‌ హంతకుడు, రౌడీ, అరాచకవాది అని నేను ఓ వీడియోలో ఆరోపించారని మంథనికి చెందిన రఘుప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధుకర్‌ ప్రతిష్టను దిగజార్చేలా, పరువు తీసేలా బహిరంగ వ్యాఖ‍్యలు చేశానని సోషల్‌ మీడియాలో వీడియో పోస్టు పేర్కొన్నారు. ‘బోల్డ్‌ ఫ్రం ది బ్లూ’అనే పేరుపై ఈ వీడియో మధుకర్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉందని, ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందని.. ఇది ఎన్నికల నియామావళిని ఉల్లంఘించినట్లే అవుతుందని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నాపై కేసు నమోదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులో ఉన్నట్లు నేను ఎప్పుడూ మధుకర్‌పై హంతకుడు, రౌడీ అన్న ఆరోపణలు చేయలేదు. వీడియోను మార్కింగ్‌ చేసి పోలీసులకు సమర్పించి ఉండవచ్చు. మధుకర్‌ను ప్రతిష్టను దిగజార్చేలా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు. వాస్తవమైన ఆడియోను రిటర్నింగ్‌ అధికారి పరిశీలించలేదు. ఈ కారణంగా నాపై కేసు నమోదు చెల్లదు. ఈ నేపథ్యంలో కేసులో అధికారులు తదుపరి విచారణను ఆపేలా, అరెస్టు సహా ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలతో పాటు కేసు కొట్టివేసేలా ఉత్తర్వులు జారీ చేయాలి’అని శ్రీధర్‌బాబు పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ శుక్రవారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. విచారణపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు…….

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *