మహిళలు స్వయం ఉపాధి లో రాణించాలి. డాక్టరేట్ అవార్డు గ్రహీత డా,సురభి శ్రీధర్ కు ఆత్మీయ సన్మానం.

మహిళలు స్వయం ఉపాధి రాణించాలని, ప్రతి మహిళ తమ స్వశక్తితో ఎదుగలన్ని డాక్టరేట్ అవార్డు గ్రహీత డాక్టర్ సురభి శ్రీధర్ అన్నారు. వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు గాను డిసెంబర్ 18న తమిళనాడు హోసూర్ లో డాక్టర్ సురభి శ్రీధర్ సేవలను గుర్తించి. ఆసియా వేదిక్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను సురభి శ్రీధర్ కు ప్రధానం చేశారు. దీనిలో భాగంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గంగపుత్ర. బెస్త సంఘం గౌరవ సలహాదారులు బంగారి రాజయ్య, సంఘం ప్రధాన కార్యదర్శి బంగారు సుభాష్, గంగపుత్ర బెస్త మహిళ కమిటీ ఆధ్వర్యంలో పూల మాల శాలువాలతో ఆత్మీయ సన్మానం నిర్వహించారు. అనంతరం డాక్టరేట్ అవార్డు గ్రహీత డా, సురభి శ్రీధర్ మాట్లాడారు. గంగపుత్ర బెస్త సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సన్మానం తనకెంతో ఆనందంగా ఉందని తనకు డాక్టరేట్ రావడనికి ప్రతి ఒక్కరి కృషి ఉందని, ఆ కృషి ఫలితమే తనకు డాక్టరేట్ రావడం జరిగిందని తెలిపారు . వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ కు సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని వారికి ‌ ఈ డాక్టరేట్ అంకితం చేస్తున్నానని తెలిపారు. వెలుగు సామాజిక సంస్థ ద్వారా మహిళలకు 45,రోజులపాటు స్వయం ఉపాధి కోర్సులు నిర్వహించడం జరుగుతుందని ఈ కోర్సుల లో టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్. బ్యూటిషన్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కోర్సుల అనంతరం‌ కోర్సు సంబంధించిన సర్టిఫికెట్ ప్రధానోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.తమ సంస్థ నిర్వహించే కోర్సులలో శిక్షకులకు అవకాశం కల్పించడం జరుగుతుందని అన్నారు. ఆసక్తి గల మహిళలు శిక్షకులు 8977748838 నంబర్ లో సంప్రదించగలరు అని తెలిపారు ఈ అవకాశాన్ని మహిళలు . శిక్షకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈకార్యక్రమంలో, అంబటి లక్ష్మి. బంగారి కళావతి. గరిగే పద్మ. ఏ రాజేశ్వరి. అంబటి ఉమా. బట్ట చంద్రకళ. అంబటి శరణ్య. నాగుల భాగ్యలక్ష్మీ. బంగారి శ్రీలత. నాగుల కవిత. గంధం అలేఖ్య తో పాటు నాగుల రాజు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *