రిలే నిరాహార దీక్షకు మద్దతు

రామగుండం నియోజకవర్గం అంతర్గం మండలం కుందనపల్లి గ్రామం లో ఉన్న ఎన్టిపిసి యాష్ పాండ్ వల్ల కుందనపల్లి గ్రామస్తులు తీవ్ర అనారోగ్య సమస్యలు ఏదురుకుంటున్నారు. 40 నుండి 45 వయసు వారు కిడ్నీ, గుండె జబ్బుల తో 60 కు పై చిలుకు మరణించగా గ్రామంలో తీవ్ర స్వశకోశ సమస్యలతో బాధపడుతున్నరు అని గ్రామస్తులు తమ గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అదే గ్రామం కు చెందిన జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన సెక్రటరీ గోపి కృష్ణ , జనసైనికుడు పృధ్వీ ద్వారా సమాచారం తెలుసుకున్న జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన అధ్యక్షుడు రావుల మధు, పెద్దపల్లి పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యులు రావుల సాయి కృష్ణ, జనసేన నాయకులు రంజిత్, రాజశేఖర్ కుందనపల్లి గ్రామస్తులను కలిసి వారి సమస్యకు పరిష్కారం వచ్చే వరకు వారికి అండగా ఉంటామని, ఎన్టిపిసి యాజమాన్యం వెంటనే కుందనపల్లి గ్రామస్తులకు పునరావాసం కల్పించాలని దీనికి ప్రభుత్వ అధికారులు సహకరించాలని డిమాండ్ చేశారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *