కుందనపల్లి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలి!
రామగుండం ఎన్టిపిసి యాజమాన్యం ప్రభావిత గ్రామాలు ఆర్అండ్ఆర్ కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్… అన్నారు. గురువారం ఢిల్లీలో రాష్ట్ర మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ ….ఎంపీలు నామా నాగేశ్వరరావు ….వెంకటేష్ నేత రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ …ఎన్ టీ పీసీ సీ. అండ్ ఎండీ గురుదీప్ సింగ్ ని కలిసారు…. సమస్యలపై వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ… ఎన్టిపిసి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన భూ నిర్వాసితులకు ప్రభావిత గ్రామాల ప్రజల అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు. ఇంటి బీసీ ప్రభావిత గ్రామాలు ఆర్అండ్ఆర్ కాలనీల్లో ప్రత్యేకంగా సీఎస్ఆర్ ద్వారా నిధులను మంజూరు చేసి అభివృద్ధి పనులను చేపట్టాలన్నారు. ఎన్టీపీసీ ప్రధాన గేటు రాజీవ్ రహదారిపై అనేక ప్రమాదాలు జరిగి కార్మికులు తమ అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నారని ఇక్కడ అండర్ పాస్ వే ఏర్పాటు చేయాలన్నారు. అంతర్గాం మండలం కుందనపల్లి గ్రామంలో ఎన్టిపిసి యాష్ పాండ్ నుండి వెలువడుతున్న బుడిద మూలంగా ఇక్కడి ప్రజలంతా తీవ్ర అనారోగ్యాల గురైతున్నరని గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని పెర్కోన్నారు. నూతనంగా నిర్మాణం అవుతున్న తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టు లో ప్రభావిత గ్రామాల ప్రజలకు స్దానికులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు…….