కాకతీయ విశ్వవిద్యాలయం అనుబంధ దూర విద్య అధ్యయన కేంద్రాన్ని రామగుండం లో యధావిధిగా కొనసాగించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ , పెద్దపల్లి ఎంపి వెంకటేష్ నెత కోరారు… శుక్రవారం ఢిల్లీలో యు.జి.సి ఫైనాన్స్ ఆడ్వజర్ ఠాగూర్ గారిని పెద్దపల్లి ఎంపి వెంకటేష్ నెత … రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ … కలసి వినతి పత్రాన్ని సమర్పించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకతీయ విశ్వవిద్యాలయo అనుబంధ దూర విద్య అధ్యయనకేంద్రం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖనిలో గత 25 సంవత్సరాల నుంచి ఎస్.డి.ఎల్.సి నడుస్తుందని, యూజీసీ నిబంధనల మేరకు యూనివర్సిటీ పరిధిలో లేదనే కారణంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని అధ్యయన కేంద్రాలను ను తొలగించడం సరైంది కాదన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఎస్.డి.ఎల్.సి లో డిగ్రీ, పీజీ విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వడంలేదని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీలో పరిధి లో ఉందని శాతవాహన యూనివర్సిటీ లో దూరవిద్య అధ్యయన కేంద్రం ఏర్పాటు చేసేంత వరకు కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రాన్ని యధావిధిగా కొనసాగించాలన్నారు. రామగుండం నియోజకవర్గంలో సింగరేణి, రామగుండం ఎరువుల కర్మాగారం ఎన్టీపీసీ బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ లాంటి పరిశ్రమలు ఉన్నందున ఈ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు దూర విద్య ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అంతేకాకుండా పేద విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, తమ ప్రమోషన్ల కొరకు దూరవిద్యలో విద్యను అభ్యసించడానికి ఎస్ డి ఎల్ సి ఎంతగానో ఉపయోగపడుతుందని రామగుండం ప్రాంతంలో ఎస్ డి ఎల్ సి ని యధావిధిగా కొనసాగించాలని పెర్కోన్నారు.
Post Views: 95