శాంతి భద్రతల పరిరక్షణ పటిష్టం చేయాలి !
రామగుండం పోలీస్ కమీషనరెట్ హెడ్ క్వార్టర్స్ లో గోదావరిఖని సబ్ డివిజన్ సివిల్ పోలీస్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు… పరేడ్ కి రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ (ఐజీ) …. హాజరై గౌరవ వందనం స్వీకరించి తరువాత సిబ్బంది ప్రదర్శించిన శాంతి భద్రతలకు విఘాతం కలిగే సందర్భాలలో, ఆందోళనల సమయాలలో అధికంగా ప్రజలు గుమిగూడి ఉన్నప్పుడు ఏ విధంగా చెదర కొడతాము, ఆయుధాలను ఏ సమయంలో ఉపయోగిస్తాము సమస్య ఏలా సద్దుమణచాలి, తదితర అంశాలపై, సమూహాలను చెదరగొట్టే క్రమంలో ఆందోళనకారులు లేదా పోలీసు సిబ్బంది గాయపడితే ఎలాంటి తక్షణ చర్యలు చేపట్టాలో మాబ్ రీహార్సల్ ప్రాక్టీస్, ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్, సెర్మొనల్ డ్రిల్ సిబ్బంది ప్రదర్శనని పరిశీలించారు….
సీపీ మాట్లాడుతూ…. . ప్రజారక్షణ లో భాగంగా శాంతిభద్రతల పరిరక్షణ మరింత పటిష్టం చేసి ప్రజల్లో పోలీస్ శాఖ కి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే సందర్భాలలో ఆందోళనల సమయాలలో జన సమూహాన్ని ఎలా చెదరగొట్టాలి, సమస్య ఎలా సద్దుమణచాలి అనే విషయాలఫై సిబ్బంది, అధికారులకు సూచించడం జరిగింది. ఎప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఏలాంటి ఈ సమస్య వచ్చినా ఎదుర్కొనే విధంగా, ఉండాలన్నారు. లాఠీ, రైట్ గేర్ పార్టీ సామాగ్రి ని ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి అన్నారు. వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి క్రమశిక్షణ, యూనిటీ గా ఉండడం, ఫిజికల్ ఫిట్నెస్ కి ఉపయోగపడుతుందన్నారు. సమయం దొరికినప్పుడు సిబ్బంది అధికారులు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం అని, మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విదులు నిర్వహించడానికి మంచి అవకాశం ఉంటుంది. మంచిగా ప్రజల మన్ననలు పొందేలాగా పనిచేయాలని తెలిపారు…ఈ పరేడ్ లో గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్,ట్రాఫిక్ ఏసీపీ బాల రాజు, ఆర్ఐ లు మధుకర్, శ్రీధర్, విష్ణు ప్రసాద్ గోదావరిఖని 1టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు,రాజ్ కుమార్ , గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కనతల లక్ష్మీనారాయణ, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ, ఆర్ఎస్ఐలు, సిబ్బంది హాజరయ్యారు……….