ఏరువాక లో కోరుకంటి!

రైతు సంక్షేమంలో దేశానికే ఆదర్శం తెలంగాణ రాష్ట్రం… తెలంగాణ రైతాన్న కళ్లల్లో అనందం నింపుతూ వారిని రాజులుగా మారుస్తున్న సిఎం కేసీఆర్‌ అన్నదాత నా గుండెల్లో కొలువైన దైవమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం పాలకుర్తి మండలం కొత్తపల్లి కుక్కల గూడూరులో ఎమ్మెల్యే…..పర్యటించారు. కొత్తపల్లి గ్రామంలోగండి పడి కట్ట తెగిన బామండ్ల కుంటను ఎమ్మెల్యే గారు పరిశీలించారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పొలం బాట, రైతులతో నాట్లేసే అక్కలతో మాట -ముచ్చట చేపట్టారు. మహిళ రైతులతో కలసి నాటు వేసారు.

వర్షాలతో నష్టపోయిన పంట పోలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమైక్య రాష్ట్ర పాలనలో రైతులను పట్టించుకున్న వారే లేరని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనసున్న మారాజు సిఎం కేసీఆర్‌ …. రైతుల సంక్షేమమే తమ ప్రధాన ఎజెండాగా పరిపాలన ప్రారంభించారని అన్నారు. రైతులకు ఉచితంగా ఇరవై నాలుగు గంటల కరెంటు, రైతు బంధు పధకం ద్వారా ఉచితంగా పెట్టిబడి సహాయం, సకాలంలో ఎరువుల పంపిణీ చేసి రైతన్నలకు కోడంతా అండగా నిలుస్తున్నరన్నారు. రైతు మరణిస్తే ఆ కుటుంబ‍నికి ఆసరా నిలిచేందుకు రైతు భీమా పధకం ద్వారా 5 లక్షల సహాయం అందించడం జరుగుతుందన్నారు. వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు వితంతువులకు గౌరవంగా జీవించేలా నెలకు రెండువేల రూపాయల ఆసరా పింఛన్ అందిస్తున్నది సిఎం కేసీఆర్‌ గారన్నారు. కేంద్రంలో బిజేపి ప్రభుత్వం రైతులను, సామాన్య ప్రజలను అరిగోస పెడుతున్నారని.. గ్యాస్ ధరలు డిజిల్ పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను కష్టాలు పెడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెరిగిన ధరల తగ్గించాలని కేంద్రంతో కోట్లాడుతున్నరన్నారు. రైతులు పండించిన పంటను కేంద్రం కోనుగోలు చేయకపోతే సిఎం కేసీఆర్‌ …. ప్రతి గ్రామంలో ధాన్యం కోనుగోలు కేంద్రాలను ఎర్పాటు చేసి రైతులు పండించి ప్రతి గింజను కోనుగోలు చేసిన రైతు పక్షపాతి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడక ముందు ప్రభుత్వంలో కరెంట్‌కోతలతో రైతులు సతమతమై, పొలాల దగ్గరనే పడుకునే వాళ్లని, ఆ సమయంలో విషపురుగుల కాటుకు ఎంతో మంది ప్రాణాలను కోల్పోగా.. బాధిత కుటుంబాలు రోడ్డున పడ్డాయని సీఎం కేసిఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్దితో, సంక్షేమంలో ముందుకు దూసుకెళ్తుంటే, కేంద్రప్రభుత్వం మాత్రం నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యుని నడ్డి విరుస్తుందన్నారు. అభివృద్ది అంటే ధరలు పెంచడం కాదని కేంద్రప్రభుత్వం గుర్తెరగలని సూచించారు. ఇవేమి పట్టి పట్టనట్టుగా బిజేపి నాయకులు పట్టణాలు, గ్రామాల్లో తిరుగుతూ.. ప్రజల్లో విషాన్ని నింపే ప్రయత్నం చేస్తుందని ఆక్రోశించారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా బిజేపి పాలిత రాష్ట్రాల్లో సీఎం కేసిఆర్‌ గారి సంక్షేమ పథకాలు ఏ ఒక్కటైన అమలవుతున్నాయని ప్రశ్నించారు. గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా బిజేపి ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ ధరలను తగ్గించాలని, అదేవిధంగా విషపూరిత ప్రచారాలను నిలిపివేయాలని లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. మన కోసం అలోచించే మన నాయకులు కేసీఆర్‌ కి మనమందరం అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి సర్పంచ్ లు మల్లెత్తుల శ్రీనివాస్ కొండ్ర చందర్ టి.ఆర్. ఎస్ మండలాధ్యక్షుడు బోమ్మగాని తిరుపతి గౌడ్ మార్కెట్ కమిటి చైర్మెన్ అల్లం రాజన్న నాయకులు మదన్ మెహన్ రావు తదితరులు పాల్గొన్నారు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *