ఖని లో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు..!

ఖనిలో డిసెంబరు 25న క్రిస్‌మస్‌ పండగను పురస్కరించుకుని వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చిలన్నీ రంగురంగుల విద్యుత్‌ బల్బులతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. క్రైస్తవ సోదరులు ప్రముఖ చర్చిలలో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు జరిపారు. పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ పండగను ప్రభుత్వ పరంగా నిర్వహించడంతో పాటు పేద క్రైస్తవ సోదరులకు ప్రభుత్వం వైపున నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. అన్ని కాలనీలోని పేద క్రైస్తవులకు తమ చేతులు మీదుగా బట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖని లోని ప్రముఖ చర్చి బీ డి ఎస్ చర్చిలో ప్రార్థనలు జరపడానికి వివిధ ప్రాంతాల నుంచి క్రైస్తవులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేసిన చర్చి పాస్టర్ డిలైట్ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు క్రీస్తు ప్రేమ సర్వ మానవాళికి అవసరమన్నారు ఆయన పుట్టుక విశిష్టతను క్రైస్తవులకు తెలియజేశారు .అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఈ వేడుకలలో చర్చి పెద్దలు విశ్వాసులు డాక్టర్ కళావతి యోహాన్, సీనియర్ పాత్రికేయులు విలాసాగరపు శ్రీనివాస్ , తో పాటు అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.క్రైస్తవులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *