గంజాయి పై ఆటోడ్రైవర్లకు అవగాహన సదస్సు యువత భవిష్యత్తు నాశనం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది: గోదావరిఖని వన్ టౌన్ సీఐ రమేష్ బాబు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్ లో ఆటో డ్రైవర్లకు గంజాయి మరియు మత్తుపదార్థాల నియంత్రణ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. సీఐ రమేష్ బాబు మాట్లాడుతూ….. మాదక ద్రవ్యాల ప్రభావంతో యువత మత్తుకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు.👉యువత పురోగతికి అవరోధంగా నిలుస్తున్న గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను నియంత్రించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని.👉గంజాయి అమ్మకాలు, వినియోగం వలన జరిగే పరిణామాలపై ప్రజలతో పాటు యువతకు అవగాహన కల్పించాలని అన్నారు.👉ఇటీవల కాలంలో చదువుకునే విద్యార్థులు గంజాయి, డ్రగ్స్‌ కేసుల్లో నేరస్థులుగా మారుతున్నారన్నారు. జల్సాలకు అలవాటు పడిన యువత డబ్బుల కోసం నేరాలకు పాల్పడి, తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. డ్రగ్స్‌ కు అలవాటుపడిన వారి మెదడు మొద్దుబారి, తాము ఏమీ చేస్తున్నారన్న విషయాన్ని మరిచిపోయి, విచక్షణ కోల్పోయి, తల్లిదండ్రలను ఎదిరిస్తూ, ప్రేమ పేరుతో బాలికల్ని వేధిస్తూ, పోక్సో కేసుల్లో నేరస్థులుగా మారుతున్నారని వివరించారు. మాదక ద్రవ్యాల వైపు యువత ఎవ్వరూ ఆకర్షితులు కావద్దని, లక్ష్య సాధనకు కృషి చేయాలని అన్నారు.యువత మత్తుకు బానిసలుగా కాకుండా చూసుకోవాలని తెలిపారు. 👉 రైల్వె స్టేషన్లలో, ఆర్టీసీ బస్ స్టాండ్లలో గంజాయి మరే ఇతర మత్తు పదార్థాలు విక్రయాలు, సేవించడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లుగా సమాచారం అందితే తక్షణే సమాచారం 100 డైల్ కు గాని పోలీస్ స్టేషన్ కు గాని సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు👉 రైల్వే స్టేషన్లో, ఆర్టీసీ బస్ బస్టాండ్ లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించిన,గంజాయి రవాణా చేసినట్లు అయితే తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలి. 👉 మీ ఆటోలలో ఎవరైనా ప్రయాణికులు గంజాయి రవాణా చేస్తున్నట్లు గాని అమ్ముతున్నట్లు గాని మీకు తెలిస్తే గోదావరిఖని 1టౌన్ ఇన్స్పెక్టర్ కు కాల్ చేసి సమాచారం అందజేయాలి…..

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *