ఘనంగా గోదావరి కళాసంఘాల వన భోజనం!
సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం రోజున మంచిర్యాల జిల్లా ఏసీసీ క్వారీ దుర్గా దేవి ఆలయ ఆవరణలో కళాకారుల ఆత్మీయ కలయిక, వనభోజన చెట్లతీర్థం కార్యక్రమాన్ని ఘణంగా నిర్వహించినారు.గోదావరి కళా సంఘాల సమాఖ్య అధ్యక్షులు కనకం రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ యొక్క కార్యక్రమంలో ఖని కి చెందిన 50 మంది కళాకారులు కుటుంబ సభ్యులతో సహ పాల్గొని ఆనందంగా గడిపినారు.మధ్యాహ్నం భోజనం అనంతరం ,సాయంత్రం 4 గంటల నుండి కళా కారుల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించినారు.కార్యక్రమంలో సినిమా, జానపద, లలిత, భక్తి గీతాలు, మాజిక్ షో ,హస్యవల్లరి మొదలగు కార్యక్రమాలతో అందరూ ఉల్లాసంగా గడిపినారు.
అనంతరం……………..గోదావరి కళా సంఘాల సమాఖ్య న్యాయ సలహదారులుఅడ్వకేట్ మేడ చక్రపాణి గారు ఈమధ్య నే గోదావరిఖని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు కు ప్రభుత్వ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఎన్నికైన సందర్భంగా కళా కారులందరు ఫూలమాల శాలువా లతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసినారు.లాయర్ చక్రపాణి గారు మాట్లాడుతూ, ఖని పారిశ్రామిక ప్రాంతం నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చిన కళా కారులు ఎంతో మంది ఉన్నారని , ఆత్మీయంగా సన్మానించిన కళా సమాఖ్య కు ధన్యవాదాలు తెలియజేసి కళా కారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన తెలియజేసినారు.ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సోగాల వెంకటి ,ప్రధాన కార్యదర్శి మాదరి శ్రీ నివాస్, సలహదారులు నిట్టూరి జీవన్ బాబు, లాయర్ కొప్పుల శ్రీధర కాసిపాక రాజమౌళి, పానుగంటి మదుణయ్య అంజలి, కళ్లెపెళ్ళి రాజేశం ,బోడకుంట వెంకట్రాజం, టి అంజయ్య , రాజబాబు, ధన్ సింగ్, పోశమల్లు ,మొండి, చంద్రపాల్ ,మాజిక్ హరి, రామస్వామి,అల్లాడి లలిత, శైలజ ,పద్మ లక్ష్మీ నారాయణ, శ్రీ నివాస్ తదితరులు పాల్గొన్నారు.సమాఖ్య సహయ కార్యదర్శి రాజబాబు వందన సమర్పణతో సాయంత్రం 7 గంటల కు కార్యక్రమం ముగిసింది………………………………