దిశా నిర్దేశం!

పెద్దపల్లి లో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయం, టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవాలకు .. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, విచ్చేస్తున్న సందర్భంగా వివిధ జిల్లాల నుండి బందోబస్తుకు వచ్చినా పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ … వి. సత్యనారాయణ ఐపిఎస్ గారు బందోబస్తు గురించి దిశానిర్దేశం చేశారు…. ఉదయం…. గంటలకు నుండి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు పర్యటన ప్రారంభమవుతుంది. బందోబస్తుకు వచ్చిన పోలీస్ అధికారులు సిబ్బంది సీఎం పర్యటించే ప్రాంతాలు మరియు చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను గమనిస్తూ ఉంటూ విధులు నిర్వహించాలని సూచించారు. సీఎం గారి పర్యటన సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం బందోబస్తును 15 సెక్టార్లుగా విభజించడం జరిగినది. ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, ఏసీపీలు/డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు/హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు/ మహిళాకానిస్టేబుళ్లు/మహిళహోంగార్డు/హోంగార్డు, మరియు స్పెషల్ పార్టీస్/రోప్పార్టీస్/బీడీటీమ్స్/డాగ్ స్క్వాడ్/సెక్యూరిటీ వింగ్, మఫ్టీపార్టీ మొత్తం 3000 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని కమిషనర్ గారు తెలిపారు.

1. రేపు ఉదయం 07 గంటలకు అధికారులు సిబ్బంది నీట్ యూనిఫామ్ లో ప్రతి ఒక్కరూ వారికి కేటాయించిన డ్యూటీలో ఉండాలని సూచించారు.

3. వివిధ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ప్రజలు పాల్గొంటున్నందున అందరితో మర్యాదగా మాట్లాడాలని అధికారులకు సిబ్బందికి సూచించారు.

4. అధికారులందరికీ కమ్యూనికేషన్ సెట్లు ఇవ్వడం జరుగుతుందని ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని తెలిపినారు.

5. డ్యూటీలో ఉన్న అధికారులు సిబ్బంది ఎంతో క్రమశిక్షణతో డ్యూటీ చెయ్యాలని వారి డ్యూటీ ఉన్న ప్రదేశం చుట్టుపక్కల గమనిస్తూ అలర్ట్ గా ఉండాలని తెలిపినారు.

6. ట్రాఫిక్ అండ్ పార్కింగ్ డ్యూటీలో ఉన్న అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి డ్యూటీలు చేయాలని ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా వెంటనే వాహనాలను ఒక క్రమపద్ధతిలో పెట్టించాలని రోడ్ పైన వాహనాలు నిలపకుండా చూడాలని సూచించారు.

7.. సీఎం వెళ్లే మార్గంలో ఎలాంటి వాహనాలు నిలుపకుండా డ్యూటీలో ఉన్న అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు.

8. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించి తప్పకుండా మాస్క్ ధరించాలని సూచించారు.

9.బందోబస్తు కొచ్చిన అధికారులకు సిబ్బంది సీఎం గారు మరియు ప్రజా ప్రతినిధులు, ప్రజలందరూ వెళ్లిన తర్వాతనే సిబ్బంది అధికారులు వెళ్లాలని సూచించారు.

సీఎం గారు సందర్శించు ప్రదేశాలు

👉 నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవం👉 నూతనంగా నిర్మించిన టిఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనం ప్రారంభోత్సవం.

👉ప్రారంభోత్సవాల కార్యక్రమం అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు.

పార్కింగ్ ప్రదేశాలు

1.నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు గ్రీన్ సిటీ లో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి.

2. మంథని మరియు మంచిర్యాల గోదావరిఖని ప్రాంతం నుంచి వచ్చే వాహనదారులు పెద్దపల్లి గ్రీన్ సిటీ లో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి.

3. హుజురాబాద్, కరీంనగర్, సుల్తానాబాద్ ప్రాంతాల వైపు వచ్చే వాహనదారులు మెయిన్ మీటింగ్ ప్లేస్ వద్ద గల పార్కింగ్ లో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి.

4. పెద్దపల్లి చుట్టుపక్కల జూలపల్లి, ధర్మారం, పెద్దపల్లి ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు ఎల్లమ్మ చెరువు నుండి మీటింగ్ ప్లేస్ లో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి.

5. VIP పార్కింగ్ సఖి సెంటర్ ద్వారా మీటింగ్ ప్లేస్ లో పార్కింగ్ ఏర్పాటు చెయ్యాలి..

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *