ఒక్క రోజులోనే సింగరేణి అద్బుతం!……

ఈనెల 28 తేదీ ఒక్కరోజే 2.53 లక్షల టన్నుల బొగ్గు రవాణా

2.46 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి..

రికార్డు స్థాయిలో అదేరోజు 44 రైలుబండ్ల ద్వారా వినియోగదారులకు సరఫరా

సంస్థ ఛైర్మన్ అండ్ ఎండీ ఎన్. శ్రీధర్ అభినందనలు.

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తన ఒక్కరోజు బొగ్గు ఉత్పత్తి, రవాణాలో బుధవారం నాడు ( 28 న) సరికొత్త రికార్డులను సృష్టించింది. బుధవారం ఉదయం షిప్టు నుండి మొదలు రాత్రి షిప్టు మధ్యగల 24 గం॥ల వ్యవధిలో 2.46 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు, 2.53 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిపి ఈ ఆర్థిక ఆర్థిక సంవత్సరంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. తద్వారా ఇదే నెల 20వ తేదీన తాను నెలకొల్పిన 2.24 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2.35 లక్షల టన్నుల రవాణా రికార్డులను తిరగరాసింది.బొగ్గు రవాణాకు ద.మ. రైల్వే సహకారంతో గరిష్ట స్థాయిలో 44 రైలు బండ్ల (రేకులను) వినియోగంచడం కూడా సరికొత్త రికార్డే. దీనిపై సంస్థ ఛైర్మన్ , ఎండీ ఎన్. శ్రీధర్ తన హర్షం ప్రకటిస్తూ, దీనికి కృషి చేసిన ఉద్యోగులు, అధికారులుకు, సిబ్బందికి తన అభినందనలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో ఈ ఆర్థిక ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 700 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాల సాధనకు సమష్టిగా కృషి చేయాలన్నారు. ఇటీవల ఆయన నిర్వహించిన అన్ని ఏరియాల జీఎంల సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ..

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలిన ఉన్న 90 రోజుల్లో రోజుకు కనీసం 2.30 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని ఆదేశించగా బుధవారం అన్ని ఏరియాలు కలిసి ఈ లక్ష్యాన్ని దాటాయి. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. సింగరేణిలో మొత్తం 11 ఏరియాలు ఉండగా, వీటిలో బుధవారం సాధించిన రవాణా రికార్డులో మణుగూరు ఏరియా తనవంతుగా 64 వేల టన్నుల బొగ్గును అందించి మొదటి స్థానంలో నిలిచింది. కొత్తగూడెం ఏరియా 51 వేల టన్నులతో రెండవ స్థానంలో నిలిచాయి. మిగిలిన అన్ని ఏరియాలు కూడా రోజువారి నిర్దేశిత లక్ష్యాలు దాటి బొగ్గు ఉత్పత్తి చేశాయి.

కొత్తగూడెం ఏరియా నుండి 11 రైలు బండ్ల ద్వారా, మణుగూరు నుండి 9, శ్రీరాంపూర్ ఏరియా నుండి 7 రైలు బండ్ల ద్వారా బొగ్గు రవాణా చేశారు. మొత్తం మీద ఈ ఏడాది ఇప్పటివరకు 2591 రైలు బండ్ల ద్వారా 465 లక్షల టన్నుల బొగ్గును వినియోగదారులకు సరఫరా చేశారు. …..

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *