ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దడమే…..
ఆదర్శ పట్టణాలుగా తీర్చి దిద్దడమే పట్టణ ప్రగతి లక్ష్యమని రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని 37 వ డివిజన్ లో నాలుగవ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమం పురస్కరించుకొని సోమవారం నిర్వహించిన వార్డు సభలో ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రధాన పట్టణాలకు ధీటుగా తెలంగాణ రాస్ట్రం లోని పట్టణాలను తీర్చి దిద్దాలనే సంకల్పంతో ముఖ్య మంత్రి కె సి ఆర్ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారని ఆయన అన్నారు. అభివృద్ది కార్యక్రమాలలో ప్రజలను భాగస్వాములను చేయడమే కార్యక్రమ ముఖ్యోద్దేశ్యమని అన్నారు. అభివృద్ది , పరిశుభ్రత , పచ్చదనం ధ్యేయంగా అధికారులు , ప్రజాప్రతినిధులకు విస్తృత అధికారాలిస్తూ కొత్త మున్సిపల్ చట్టం అమల్లోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. చెత్త ఎక్కడికక్కడే పడేయడం వలన వ్యాదుల బారిన పడే అవకాశం వున్నందున తడి చెత్త , పొడి చెత్త గా వేరు చేసి ఇవ్వాలని అన్నారు.
డెప్యూటీ మేయర్ అభిషేక్ రావు మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవడం , తడి చెత్త ,పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం , మొక్కలు నాటి సంరక్షించడం తదితర భాద్యతలు నిర్వర్తించాలని సూచించారు. స్థానిక కార్పొరేటర్ పెంట రాజేష్ మాట్లాడుతూ వార్డులో నెలకొన్న సమస్యలను సాధ్యమైనంత త్వరగా తీర్చాలని అధికారులను కోరారు, వార్డులో ప్రతిపాదించిన పనులను త్వరగా పూర్తి చేయించాలని కోరారు. వార్డు అభివృద్దికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరారు. రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ బి సుమన్ రావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలను వివరించారు. నిషేధిత ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు , సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగించవద్దని సూచించారు. చెత్త ని తడి చెత్త పొడి చెత్తగా విభజించి మున్సిపల్ వాహనానికి అందించాలని కోరారు.అంతకు ముందు వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రగతి స్పెషల్ ఆఫీసర్ , జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్ , నగర పాలక సంస్థ ఎస్ ఇ చిన్నా రావు తదితరులు పాల్గొన్నారు.