సింగరేణి ఓసిపి _5 లో ఫెన్సింగ్ ఏర్పాటు కు భూమి పూజ

భవిష్యత్ లో చేపట్ట బోయే ఉపరితల గనికి సంబందించిన పర్యావరణ ప్రజాభి(పాయ సేకరణ లో భాగంగా పలువురు వక్తలు పర్యావరణ విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తల సూచనల మేరకు , ఈ రోజు సుమారు 2 ½ కి.మీటర్ల మేరా ,సుమారు 2 కోట్ల వ్యయం తో 4 ½ మీటర్ల ఎత్తు తో ఇనుప జాలి ఫెన్సింగ్ పనులను (పారంభించటం జరిగింది ,పని పూర్తి అయిన తర్వాత దాని వెంబడి పూల మొక్కలు , (కొటాన్ మొక్కలను పెంచుటకు నిర్ణయం తీసుకోవటం జరిగింది . దీనిలో భాగంగా ఈ రోజు జీడికే 5 ఇంక్లైన్ నుండి ఏరియా వర్క్ షాప్ వరకు నూతనంగా నిర్మించిన రోడ్డు పక్కన భూమి పూజా కార్యక్రమం ఆర్ జి 1 ఏరియా జీఎం కె నారాయణ … చేతుల మిధుగా కొబ్బరికాయ కొట్టి (పారంభించటం జరిగింది. ఈ కార్యక్రమంలో టిబిజికెఎస్ ఉపాద్యక్షులు గండ్ర ధామోదర్ రావు , సి ఏం ఓ ఏ ఐ అధ్యక్షులు పోనోగోటి శ్రీనివాస్ ,ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కె వి రావు ,ఎజీఎం ఫైనాన్స్ రామ కృష్ణ గారు ,ఏజీఎం ఎక్స్ ప్లోరేషణ శివ నారాయణ , ఏజెంట్ శ్రీనాథ్ , పర్సనల్ డీజీఎం లక్ష్మీ నారాయణ ,డి.జీ.ఎం సివిల్ నవీన్ ,డి.జీ.ఎం ఏరియా వర్క్ షాప్ మధన్ మోహన్ గారు ,డి.జీ.ఎం.ఐ.ఈ.డి ఆంజనేయులు గారు ,డి.వై.సి.ఎం.ఓ కిరణ్ రాజ్ కుమార్ గారు,ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్ … మరియు ఇతర అధకారులు పాల్గొన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *