23 డివిజన్ ఓటరు జాబితా విడుదల, అభ్యంతరాలు ఉంటే తెలపండి!

ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం రామగుండం నగర పాలక సంస్థ 23 వ డివిజన్ ముసాయిదా ఓటరు జాబితాను శుక్రవారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ బి. సుమన్ రావు మాట్లాడుతూ ఓటరు జాబితాకు సంబందించి అభ్యంతరాలను ఈ నెల 16 వ తేదీ లోగా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కు సమర్పించాలని అన్నారు. ఈ నెల 12 న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం , 19 న అభ్యంతరాల పరిష్కారం , 21 న తుది ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు.ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్ నారాయణ రావు, సెక్రటరీ రాములు,రెవెన్యూ ఆఫీసర్ మనోహర్,టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ సతీష్ పాల్గొన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *