ఆపేయండి!

రామగుండం ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం… రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా డస్ట్ కలెక్షన్ అండ్ రికవరి సిస్టం లేకపోవడంతో కర్మాగారం నుండి వెలువడుతున్న అమెానీయ గ్యాస్ తో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, ఎరువుల కర్మాగారం నుండి శుద్ధిచేయని వ్యర్ద జలాలను నేరుగా గోదావరినదిలో వదలడంతో గోదావరి నది కలుషితం అవుతుందని, రామగుండం ఎరువుల కర్మాగారం యాజమాన్యం కలుషిత నివారణ చర్యలు చేపట్టాలని పలుమార్లు సూచించినా నిర్లక్ష్యంగా వ్యవహరించిదని… ఆర్ఎఫ్సీఎల్లో కాలుష్య నివారణ చర్యలు చేపట్టేలా చూడాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసినట్లు రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా టీ ఆర్ ఎస్ పార్టీ బాధ్యులు.. కోరుకంటి చందర్ తెలిపారు.

…..ఫిర్యాదు నేపథ్యంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. రామగుండం ఎరువుల కర్మాగారం నుండి గ్యాస్ లీక్ అవుతుందని కర్మాగారం నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలను గోదావరి నదిలో కలుస్తున్నాయని కనీస నిబంధనాలు పాటించడం లేదని.. ప్లాంట్ వల్ల కలుష్యం పెరిగిపోయిందని టాస్క్ ఫోర్స్ తమ నివేదికలో పెర్కోన్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కర్మాగారం ఉత్పత్తి ఆపివేయాలని ఆదేశాలను జారీ చేసింది.రామగుండంలో ఎరువుల కర్మాగారం నిర్మాణమైతే ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించామని కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్రప్రభుత్వం ఫ్లాట్ నిర్మాణంలో 11 శాతం పెట్టుబడి పెట్టిందని అన్నారు. నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన ఈ ప్రాంత వాసులకు యాజమాన్యం మొండిచేయి చూపిందన్నారు. ఉద్యోగ అవకాశాల కల్పనలో ఈ ప్రాంతవాసులకు అవకాశం లేకుండా చేసిందన్నారు. ప్లాంట్ నిర్మాణం సందర్భంగా ప్రజాభిప్రాయ సేకరణలో ప్లాంట్లో వినియోగించే నీటిని శుద్ధిచేసే పరిశ్రమలకు టౌన్ షిప్ చెట్ల పెంపకాలకు వాడుకుంటామని… వర్షాకాలంలో మిగులు నీటిని శుద్ధి చేసి గోదావరి నదిలోకి వదులుతామని అర్.ఎఫ్.సి.ఎల్ యాజమాన్యం ప్రకటించిందన్నారు. ఎరువుల కర్మాగారంలో యూరియా ట్రస్ట్ కనెక్షన్ అండ్ రికవరీ సిస్టం లేకపోవడం మూలంగా యురియ తయారి అనంతరం అమోనియా లీక్ అయి ఈ ప్రాంతంలోని ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తున్నయన్నారు. ఫ్లాట్ ను ఆనుకుని ఉన్న వీర్లపల్లి గ్రామం తరలింపుపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిత్యం గ్రామ ప్రజలు ప్లాంట్ శబ్దాలు, కులుష్యంతో నిత్యం నరకయాతన పడుతున్నరన్నారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. రామగుండం ప్రజల కోసం ఎంతో దూరం వెళ్లడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని ఆర్.ఎఫ్.సి.ఎల్ యాజమాన్యం కాలుష్య నివారణ చర్యలు చేపట్టి తీరాలన్నారు…………….

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *