బండి వి అవివేకపు వ్యాఖ్యలు!

తెలంగాణలోని మసీద్ లలో తవ్వకాలు చేపట్టాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన వాక్యలు ఆయన అవివేకానికి నిదర్శనమని ఎంఐఎం పెద్దపెల్లి జిల్లా కోశాధికారి షేక్ నసీరుద్దీన్ వాఖ్యానించారు .మూడేండ్లలో కరీంనగర్ ఎంపీ గా బండి సంజయ్ చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. ప్రజల ఆధ్యాత్మిక మసీద్ లు దేవాలయాలు దేవుళ్ళని రాజకీయాలకి వాడుకోవడం హీనమైన చర్య అని పేర్కొన్నారు .మతాల కులాల మధ్య వైశ్యమాలు రెచ్చగొట్టే వ్యక్తి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీగా అనర్హుడని మండిపడ్డారు . ఎంపీగా బండి సంజయ్ ప్రమాణస్వీకారం ఏమని చేశారో గుర్తుందా అని ప్రశ్నించారు … ప్రజాప్రతినిధిగా వ్యవహరించాల్సిన వ్యక్తి మతాల మధ్య కులాల మధ్య గొడవలు పెట్టడం కేవలం రాజకీయ గుర్తింపు కోసమే పాకులాట అని అని పేర్కొన్నారు ..అన్ని వర్గాల ప్రజల మధ్య మత సామరస్యాన్ని పాటించి అందరి నాయకుడు అనిపించుకోవడమే నిజ నాయకుని లక్షణమని పేర్కొన్నారు … నిత్యం మతాలు కులాల మద్య రెచ్చగొట్టే వాక్యలు చేసి ఓట్లు అడుక్కునే కాలాలు పోయాయని బండి సంజయ్ చేసే విషపూరిత వాక్యాలు ప్రజలు విశ్వసించరని తెలిపారు .. కులమతాల బేధాలు లేకుండా సోధరభావం తో ఉండే ప్రజల మధ్య చిచ్చుపెట్టే బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *