ప్రజల కోసమే రామగుండం పాలకపక్షం!
ప్రజల సమస్యల పరిష్కారం కోసమే పాలక వర్గం పని చేస్తుందని అన్నారు. సోమవారం రామగుండం నగర పాలక సంస్థ మూడవ సాధారణ సమావేశం ముగిసిన తరువాత ఆయన మాట్లాడుతూ అభివృద్దికి సంబందించిన అంశాలే అజెండా లో పొందు పరచడం జరిగిందని అన్నారు. డివిజన్ లలో చాలా చోట్ల ఏర్పడిన గుంతలను పూడ్చాలని పలువురు కార్పొరేటర్లు చేసిన సూచన మేరకు వార్డుకు దాదాపు లక్ష రూపాయలు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ట్రేడ్ లైసెన్స్ ఫీజుల సవరింపు అంశం చేర్చి నట్లు ఆయన తెలిపారు. నగర పాలక సంస్థ లో ప్రస్తుతం ఉపయోగిస్తున వాహనాల సంఖ్య పెరగడంతో పాటు డీజిల్ రెట్లు కూడా పెరిగినందున మరో మూడు నెలలకు రూ. 90 లక్షల బడ్జెట్ అంచనా మత్రమే ప్రవేశ పెట్టడం జరిగిందని అయితే వినియోగాన్ని బట్టి బిల్లు చెల్లించడం జరుగుతుందని అన్నారు. కొంత మంది కాంట్రాక్టర్ లు పనులు తీసుకొని అకారణంగా ప్రారంభించడం లేదని అలాంటి వారందరినీ బ్లాక్ లిస్టు లో పెట్టాలని ఆదేశించారు.కాగా ఈ సమావేశం లో 26 అంశాలు ప్రవేశ పెట్టారు. ఇందులో 14 వ అంశo రికార్డుల పరిశీలన అనంతరo నిర్ణయం తీసుకుందామని నిర్ణయించగా 15 వ అంశంలో మెడికల్ కళాశాల కు కేటాయించిన స్థలం లో తుమ్మలు , ముళ్ళ పొదల తొలగింపు కొరకు కాకుండా డివిజన్లలో పనులు చేపట్టడానికి బ్లేడ్ ట్రాక్టర్ , జె సి బి ని అద్దె ప్రాతిపదికన వినియోగించు కోవడానికి ఆమోదం తెలిపారు. కాగా సింగరేణి స్థలాల్లో నిర్మాణాలకు ఇంటి నంబర్లు ఇవ్వక పోవడం , నిర్మాణ అనుమతులు రాక పోవడం వంటి అంశాలు పలువురు కార్పొరేటర్లు దృష్టికి తేగా ఇట్టి సమస్యకు పరిష్కారం కొరకు కౌన్సిల్ తీర్మానం చేసి మునిసిపల్ డైరెక్టర్ దృష్టి కి తీసుకు వెళ్ళాలని నిర్ణయించారు. సమావేశంలో డిప్యుటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు , కార్పొరేటర్లు , కో ఆప్షన్ సభ్యులు , కమీషనర్ సుమన్ రావు , డిప్యుటీ కమీషనర్ నారాయణ రావు , సెక్రెటరీ రాములు, ఇఇ మాధవి, యాదగిరి , ఎ సి పి శ్యాం కుమార్ , ఆర్ ఓ మనోహర్ ,సానిటరీ ఇన్స్పెక్టర్ నాగ భూషణం తదితరులు పాల్గొన్నారు.