సిరిసిల్ల లో మెడికల్ మాఫియా!

తనిఖీలు లేకనే రెచ్చిపోతున్న మెడికల్ మాఫియా.

ఫిర్యాదు చేస్తే మెడికల్ మాఫియా కు లీకులు ఇస్తున్న అధికారులు.

సిరిసిల్ల ప్రత్యేక ప్రతినిధి: ఆదాయం కోసం వైద్యులచే అనవసరపు మాత్రలు రాయిస్తున్న మెడికల్ మాఫియా. ఆరోగ్యంపై ప్రజలు చూపుతున్న ఆసక్తిని ఆసరాగా చేసుకుని, సందుకో వైద్యశాలను ఏర్పాటు చేస్తూ, వైద్యం పేరిట ప్రజల రక్తాన్ని తాగుతున్నా రు. సిరిసిల్ల! రాజన్న సిరిసిల్ల జిల్లాగా రూపాంతరం చెందడమే తడువుగా ఐదుగురు కలిసి 25 లక్షలు వేసుకొని ఆస్పత్రి ఏర్పాటు చేసి, ఆదాయమే లక్ష్యంగా వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నారు. ఈ తంతు జిల్లా కేంద్రంలో అత్యధికంగా సాగగా, అధికార పార్టీ నాయకుల అండదండలతో మండల కేంద్రంలో సైతం ఈ మాఫియా వ్యాపారాన్ని విస్తరింప జేస్తోంది. వివరాల్లోకెళ్తే అతను ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. తన కాలికి గతంలో గాయమైంది అంటూ, జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాడు. గాయాన్ని పరిశీలించిన వైద్యుడు అతనికి తగు మాత్రలు రాశాడు. రాసిన మందుల చీటీని అదే ఆసుపత్రిలోని మెడికల్ షాప్ లో చూపించగా, డాక్టర్ రాసిన మొత్తం మందులకు 3 వేల రూపాయలు అవుతాయని సదరు మెడికల్ యజమాని తెలపడంతో నేవ్వేరా పోవడం రిటైర్డ్ ఉద్యోగి వంతైంది.ఇలా జిల్లా కేంద్రంలోని ఆసుపత్రుల్లో రోజుకు లక్షల్లో మందుల వ్యాపారం సాగుతుంది. ఇలాంటి విషయాలు సామాజిక మాధ్యమాలలో చెక్కర్లు కొడుతున్న, ఫిర్యాదు అందుతేనే స్పందిస్తాం అనే విధంగా జిల్లా వైద్యాధికారుల తీరుంది. రాజన్న జిల్లాలో పనిచేస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎప్పుడొస్తారు, ఎక్కడుంటారో తెలియని పరిస్థితి. డ్రగ్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్య వైఖరి వల్లే జిల్లాలో మెడికల్ మాఫియా రాజ్యమేలుతుందని విమర్శలు వేలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు స్పందించి తగు విధమైన చర్యలు చేపట్టాలని ప్రజలు, ప్రజా సంఘాలు కోరుతున్నా యు. వైద్యశాలకు వచ్చే రోగులకు అనవసరపు మాత్రలు రాస్తూ, మాత్రల రూపంలో పేదల రక్తం తాగుతున్న మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టడానికి డ్రగ్ ఇన్స్పెక్టర్ జిల్లా కేంద్రంలో ఉండాలి. సదరు ఆసుపత్రులపై తనిఖీలు చేపట్టాలి.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *