ఓ సి పి 5 కోసం ముస్లింల కబరిస్తాన్ నాశనం చేస్తున్నారు!

రామగుండం పారిశ్రామిక ప్రాంతం లో ముస్లిం సోదరులు గత 80 నుండి90 సంవత్సరాల నుండి ఫోరింక్ లైన్ దగ్గర ఈద్గా ను ఏర్పాటు చేసుకొని వారి యొక్క పండుగ అయినటువంటి రంజాన్, బక్రీద్ పర్వదినాన్ని ప్రార్థన చేసుకొని వెళ్లేవారు. అదే విధంగా ముస్లిం సోదరులు సోదరిమణులు ఎవరైనా మరణించిన కబరిస్తాన్ వినియోగించుకునేవారు వారి పెద్దల పండుగ అటువంటి సందర్భంలో వారి పెద్దలకు ప్రార్థనలు కూడా చేసుకోవడం జరుగుతుంది. *హిందూ స్మశాన వాటిక మరియు క్రిస్టియన్ స్మశాన వాటిక అదేవిధంగా తాజోద్దిన్ బాబా దర్గ కూడా ఈ ప్రాంతంలో కలదు.ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కులం మతం తేడా లేకుండా కలిసిమెలిసి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మరణించిన సందర్భంలో కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ స్మశాన వాటికలు ఇక్కడ దగ్గర దగ్గర గా ఉండడం విశేషం* ఈలాంటి ఈ స్థలాన్ని ఇప్పుడు ఓపెన్ కాస్ట్ ఫైవ్ ఏర్పాటు కోసమని రామగుండం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈద్గా ను కబరస్తాన్, హిందూ స్మశాన వాటికను మరియు క్రైస్తవ సోదరుల స్మశాన వాటికను తొలగించడానికి సింగరేణి సంస్థ ప్రయత్నం చేస్తుంది. మరి ముస్లిం సోదరులు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి దాదాపుగా 50 వేల మంది రంజాన్ బక్రీద్ ఇక్కడ ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ స్థలాన్ని సింగరేణి సంస్థ తొలగిస్తే ఇక్కడున్న ముస్లిం సోదరులు ఎక్కడికి వెళ్లి ప్రార్థన చేసుకోవాలి. అదే విధంగా ముస్లిం సోదరులు మరణిస్తే వారి కబర్ ను ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఈ స్థలాన్ని సింగరేణి తొలగించడం సరైన పద్ధతి కాదు ముస్లిం సోదరుల యొక్క మనోభావాలను కించపరిచే విధంగా సింగరేణి సంస్థ వారి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇలాంటి చర్యలు భవిష్యత్తులో కూడా పాల్పడవద్దని సింగరేణి సంస్థను కోరడం జరుగుతుంది. *తెలంగాణలో కెసిఆర్ గారు హిందువుల కోసం వైకుంఠ దామలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తున్నారు*, కానీ సింగరేణి సంస్థ గోదావరిఖని ముస్లిం సోదరుల విషయంలో ఈ విధంగా చర్యలు తీసుకోవడం భావ్యం కాదు కెసిఆర్ గారు మరియు కేటీఆర్ గారు వెంటనే స్పందించి సింగరేణి సంస్థ చేపట్టే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఇక్కడి ముస్లిం సోదరులు మరియు హిందూ సోదరులు మరియు క్రిస్టియన్ సోదరులు కూడా కోరడం జరుగుతుందని ఎండి ఇబ్రహీం,ఈదునూరి శంకర్ సోమవారం ఒక ప్రకటన లో పేర్కోన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *