పట్టణ ప్రగతి … పట్టణాన్ని మార్చును గతి
రామగుండం ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఓప్పించి మెడికల్ కాలేజ్ మంజూరు చేయించామని… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ప్రతి భాగస్వామ్యులు కావాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ …. అన్నారు. శనివారం ఉదయం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలల్లో జరుగుతున్న పట్టణ ప్రగతి పనులను ఎమ్మెల్యే …. అకస్మీకంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పరిసరాల పరిశుభ్రత, వ్యర్థ పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. మెడికల్ కళాశాల పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం ఉంచాలన్నారు. ఈ కార్యక్రమం లో రామగుండం మున్సిపల్ కమీషనర్ సుమన్ రావు తదితరులు పాల్గొన్నారు