అన్నార్ధులకు అన్నమౌతున్న మడిపెల్లి మల్లేష్..
అన్నా అంటే నేనున్నా అంటూ అభాగ్యుల ఆకలి తీర్చే మడిపెల్లి మల్లేష్ నేడు ఉదయం సేవా స్పూర్తి ఫౌండేషన్ సభ్యుల సహకారంతో అనారోగ్యంతో బాధపడుతు ఎలాంటి పనిచేతకాక ఇంటికే పరిమితం అయి కుటుంబ పోషణ లేక బాధపడే కొన్ని కుటుంబాలకు నేడు సేవా స్పూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యము పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ రామగుండం నియోజక వర్గంలో ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదని ఆకలి విలువ తెలిసిన వాడిగా ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించాను పస్తులుండి పాఠశాలకు వెళ్లి అక్కడ తోటి వారు తింటున్న సమయం లో నీళ్ళు తాగి కడుపు నింపుకున్నప్పుడు అనుకున్నా..నాలాగ ఎవరూ ఆకలితో అలమటించకూడదని నేను ఈ సేవా స్పూర్తి ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫౌం డేషన్ ఆధ్వర్యం లో కరోనా కాలంలో మన నియోజక వర్గంతో పాటు పక్కనున్న నియోజక వర్గాల్లో కూడా నిత్యావసర సరుకులను నూనె ఉప్పు పప్పుతో సహా కూరగాయలు కూడా అందించి ఆకలి తీర్చడం అదృష్టంగా భావిస్తు ఇప్పటి వరకు కూడా ఆపద సమయాల్లో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తూ ఒక మేన మామ గా మెట్టలు తాళి బొట్టు బొల్లు మంచం కంచం తో సహా అందించామని,చిన్నపిల్లలకు కుర్చీలు బల్లలు పుస్తకాలు పెన్నుల తో సహా అందించి వారి భావితరాల భవితకు మా వంతు సహకారం అందించామని,నీట్ లో అత్యుత్తమ రాంక్ సాధించిన సాయి సుదీక్షిత కు ప్రతి నెల చదువు అయిపోయేంత వరకు 2000 లు అందిస్తామని,నేటి నుండి కుటుంబ పోషణ చేయలేని స్థితిలో ఉన్న కుటుంబాలకు ప్రతి నెల బియ్యం అందించాలని సంకల్పించినామని ఇది మేమేదో ఉండి చేయడం లేదని మనకున్న దాంట్లో కొంత మా సభ్యుల సహాయం తో అందిస్తున్నామని తెలియజేశాడు.నేడు ఎల్కలపెళ్ళి గేట్ కు చెందిన ముస్కే నర్సయ్య కు,లింగపురం కు చెందిన ఇరికిళ్ళ శ్రీనివాస్ కు,NTPC 23 వ వార్డ్ కు చెందిన మాదరి రమేశ్ అనే ఆటో డ్రైవర్ కు,కోట మంగ మొదలగు కుటుంబాలకు బియ్యం అందించడం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమం లో ఇంజం.సాంబశివరావు,నిమ్మరాజుల రవి కన్నూరి శంకర్. మణి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.