దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ మార్చిన ఘనత కేసీఆర్‌ది….

తెలంగాణ రాష్ట్రం లో పండిన ప్రతి గింజను కేంద్రం ప్రభుత్వం కోనేదాక వదలబోమని… వరి ధ్యానం కోనకపోతే మరో పోరాటానికి సిద్దమని రామగుండం ఎమ్మెల్యే జిల్లా టి.ఆర్.ఎస్ అధ్యక్షులు కోరుకంటి చందర్ … అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు టి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రం లో పండిన వరిధాన్యాన్ని కోనుగోలు చేయాలనీ డిమాండ్ చేస్తు గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రం లో నిరసన దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు కోప్పుల ఈశ్వర్ గారు, రామగుండం ఎమ్మెల్యే జిల్లా టి.ఆర్.ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ గారు జిల్లా జడ్పీ చైర్మెన్ పుట్ట మధుకర్ గారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, రాష్ట్ర పోలీస్ హౌజింగ్ చైర్మెన్ కోలేటి దామోదర్ … పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ… దేశానికి అన్నంపెట్టె రైతన్నకు బీజేపీ సున్నం పెడుతుంది..రైతు ప్రయోజనాలను బీజేపీ కాలరాస్తుందనన్నారు. తెలంగాణా రైతాంగం పండించిన వరిధాన్యం కొనకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కే.టీఆర్ నాయకత్వంలో మరో ఉద్యమానికి సిద్దమవుతామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన వరిదాన్యం విషయంలో తీవ్రంగా అన్యాయం చేస్తున్నారన్నారు.తీరు మార్చుకోకపోతే మరో ఉద్యమం తప్పదన్నారు. రైతు వ్యతిరేఖ చట్టాలను తెచ్చిన బీజేపీ రైతు పోరాటాలతో తోకముడిచిందని,మన పోరాటంతో కేంద్రం దిగివచ్చి దాన్యం కొనుగోలు చేయాలన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అహంకార దోరణితో ముందుకుపోతుందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ … నాయకత్వంలో రైతు అనుకూల విధానాలు అమలు చేసి వ్యవసాయాన్ని పండుగ చేస్తుంటే,అది ఓర్వలేని బీజేపీ తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం చేస్తుందన్నారు.పంజాబ్ లో రైతులు పండించిన దాన్యం కొంటారు..తెలంగాణలో ఎందుకు కొనరో ఇక్కడి బీజేపీ నేతలు సమాదానం చెప్పాలన్నారు.కేంద్రం దిగిరాకుంటే డిల్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరో పోరాటానికి సిద్దమయ్యారని,ఎద్దేడ్చిన ఎవుసం,రైతేడ్చిన రాజ్యం బాగుండదని,రైతుల ఉసురుపోసుకుంటున్న మోదీని గద్దె దించేవరకు,రైతులకు న్యాయం చేసేంతవరకు ఈ పోరాటాన్ని కొనసాగిద్దామన్నారు..కుట్రపూరితమైన ఆలోచనతో ఉన్నకేంద్ర బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్నిసాధించుకోక ముందు కరెంటు కోసం తెలంగాణ రైతులు పడ్డ కష్టాలు గుర్తెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 24 గంటల పాటు రైతులకు కరెంటు అందిస్తూ రైతుల కన్నీళ్లు తూడ్చడాని ఆయన తెలిపారు. ఇలా సజావుగా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మళ్లీ కష్టాలు రావడానికి కేంద్ర బిజెపి ప్రభుత్వం చేసిన కుట్రలే ప్రధాన కారణమవుతున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించే ప్రతి పంటను కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు ఈ దిశలోనే గత నెల రోజుల నుండి గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వాని పంపించండం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతులు పండించే ప్రతి గింజను కొనుగోలుచేయడంపై ఒక స్పష్టమైన వైఖరిని ప్రకటించే వరకు కెసిఆర్ సారథ్యంలో జరిగే ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *