బెంచిలు అందించిన లయన్స్ క్లబ్

రామగుండం లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్, గోల్డెన్ జూబ్లీ ఇయర్ 1972-2022 ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 40 బేంచీలు, గోదావరిఖని పోస్ట్ ఆఫీస్ వద్ద 5బేంచీలు, గౌతమి నగర్ లో 3బేంచీలు, సాయి సేవా సమితి ఎన్టిపిసిలో రెండు బేంచీలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రామగుండం లయన్స్ క్లబ్ గత 50 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, పేద విద్యార్థుల సౌకర్యం కొరకు కళాశాలలో బెంచీలు అందజేస్తున్నామని పేర్కొన్నారు.

లయన్స్ క్లబ్ అధ్యక్షులు మేడిశెట్టి గంగాధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి తిలక్ చక్రవర్తి, రీజినల్ చైర్మన్ బంక రామస్వామి, డాక్టర్ వెంకటేశ్వర్లు, గోలి రమణారెడ్డి, కె లక్ష్మారెడ్డి, బేణిగోపాల్ త్రివేది, ముడుతనపల్లి సారయ్య , లక్కం బిక్షపతి, గుండ రాజు, శంకరయ్య తో పాటు కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *