గోదావరిఖనిలో ఫారిన్‌‌ సిటి ఎగ్జిబీషన్ పున:ప్రారంభం…

గోదావరిఖనిలోని జూనియర్‌‌ కాలేజీ మైదానంలో ఫారిన్‌‌ సిటి ఎగ్జిబీషన్‌‌ను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌ శనివారం తిరిగి పున:ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువు, నిత్యజీవితంలో బిజీ లైఫ్‌‌ను గడిపే వారు ఒత్తిడితో సతమతమవుతుంటారని, వారు మానసిక ఒత్తిడి నుంచి దూరం కావడానికి పిల్లలు, పెద్దలకు ఎగ్జిబీషన్ ఎంతో దోహదపడుతుందన్నారు. కరోనా నిభందనల మేరకు ప్రభుత్వ ఆదేశానుసారం గత కోన్ని రోజులుగా ఎగ్జిబిషన్ నిర్వహణ తాత్కాలికంగా మూసివేశారని, తిరిగి ప్రారంభించారన్నారు. రెండేళ్ళుగా వినోద కార్యక్రమాలు లేక ఇళ్ళకే పరిమితమైన పిల్లలకు, తల్లిదండ్రులకు సాయంకాల సమయంలో ఎగ్జిబిషన్ ఒక ఆటవిడుపుగా ఉంటుందని, కోవిడ్‌‌ నిబంధనలను పాటిస్తూ ఈ ఎగ్జిబీషన్‌‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ఎగ్జిబీషన్‌‌ నిర్వాహకులు ఎండి అస్లాం మాట్లాడుతూ, వికలాంగులకు పూర్తిగా ఉచితమని పేర్కోన్నారు. ఈ సారి ఎగ్జిబీషన్‌‌ను పూర్తిగా భిన్నంగా ఏర్పాటు చేశామని, 150 అడుగుల ప్రవేశద్వారంతో పాటు లండన్‌‌ బ్రిడ్జి, మలేషియా ట్విన్‌‌ టవర్‌‌, యూనివర్సల్‌‌ గ్లోబ్‌‌, రిబ్బన్‌‌ బిల్డింగ్‌‌, వాటర్‌‌ పౌంటైన్‌‌ అందరిని ఆకట్టుకుంటుందన్నారు. వందకు పైగా విభిన్న సంస్కృతులను ప్రతిబింబించే కళాకృత వస్తువులు, గృహోపకరణ వస్తువులు, పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. రుచికరమైన ఆహార పదార్థాలైన ఛాట్‌‌ భండార్‌‌, సిమ్లా మిర్చి, ఢిల్లీ పాపడ్‌‌తో పాటు ఈ అమ్యూజ్‌‌మెంట్‌‌ పార్క్‌‌లో జాయింట్‌‌ వీల్‌‌, టోరాటోరా, కోలంబస్‌‌, సాలంబో, బ్రేక్‌‌ డ్యాన్స్‌‌, చిల్డ్రన్స్‌‌ పార్క్‌‌, రైడ్స్‌‌ ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక ఆకర్షణగా సర్కస్‌‌లో లాగా ఒకేసారి రెండు బైక్‌‌లు, ఒక కారు తిరిగే విన్యాసం చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కార్పొరేటర్లు కలవల శిరీష సంజీవ్‌‌, పెంట రాజేష్, దాతు శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి, కుమ్మరి శ్రీనివాస్, తానిపర్తి గోపాల్ రావు, వంగ శ్రీనివాస్ గౌడ్, అచ్చె వేణు, పీచర శ్రీనివాసరావు, హఫీజ్, దాసరి శ్రీనివాస్, జడ్సన్, ఇంజపురి నవీన్, ఎగ్జిబిషన్ మేనేజర్లు అంకిత్ గుప్తా, అంబుల శ్రీనివాస్‌‌, తదితరులు పాల్గొన్నారు………..

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *