గోదావరికి కరకట్ట నిర్మించండి!

గోదావరి పరివాహక ప్రాంతాన్ని వరద ముప్పు నుండి తప్పించేందుకై సుందిళ్ల నుండి మొదలుకొని గోదావరిఖని వరకు గోదావరి నదికి కరకట్ట నిర్మించాలని పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ ను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు.

మంగళవారం హైదరాబాద్ ప్రగతి భవన్ లోని ఆయన కార్యాలయంలో కేటీఆర్ ని కలుసుకొని ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో గోదావరి వరద ఉధృతి కారణంగా న్యూ పోరట్ పల్లి, మల్కాపూర్, సప్తగిరి కాలనీ, జనగామ తదితర ప్రాంతాలు నీట మునిగి జరిగిన నష్టాన్ని ఆయనకు వివరించారు… భవిష్యత్తులో ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకై సుందిళ్ల నుండి మొదలుకొని గోదావరిఖని వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర గోదావరి నదికి 110 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కరకట్ట నిర్మించాలని కోరారు. దానికి సానుకూలంగా స్పందించిన కేటీఆర్ … ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ …. దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *