నగరంలో లో ఇక అభివృద్ధి పనులు!
అభివృద్ది పనుల కోసం ప్రతి డివిజన్ కు రూ. 20 లకలు , పట్టణ హరితహారం కార్యక్రమo లో భాగంగా అత్యవసర పనుల కోసం రూ 1.00 లక్ష కేటాయించినట్లు రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ తెలిపారు. రామగుండం నగర పాలక సంస్థ ఆరవ సాధారణ సమావేశం విశేషాలను ఆయన విలేఖరులకు వివరించారు. పూర్తయిన పనులకు బిల్లు చెల్లించే అంశాలకు ఈ సమావేశంలో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. రూ. 61.45 లక్షల అంచనా వ్యయంతో మొదటి దశలో 18 చోట్ల తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ఈ సమావేశంలో ఆమోదం తెలపడం జరిగిందని అన్నారు. మొత్తం 127 అంశాలతో అజెండా రూపొ oదిoచడం జరిగిందని , 94వ , 110 వ అంశాలను మాత్రం తాత్కాలికంగా ప్రక్కకు పెట్టి మిగిలిన అన్ని అంశాలను ఆమోదించడం జరిగిందని తెలిపారు… నగరంలో కూడళ్ల అభివృద్ది పనులు ప్రారంభం అయ్యాయని ప్రస్తుతం గాంధీ చౌరస్తా అభివృద్ది పనులు చురుగ్గా సాగుతున్నాయని అన్నారు. రామగుండం కు మంజూరైన అమృత్ నిధులు సుమారు రూ. 250 కోట్లు అందుబాటులోకి వస్తే డివిజన్ లలో దాదాపుగా అన్ని అభివృద్ది పనులు పూర్తవుతాయని అన్నారు. కాగా కౌన్సిల్ హాల్ లో జరిగిన ఆరవ సాధారణ సమావేశంలో 36 వ డివిజన్ కార్పొరేటర్ బొంతల రాజేష్ మాట్లాడుతూ క్రీడా ప్రాంగణాల కోసం సింగరేణి సంస్థ భూమి కేటాయించేలా చొరవ తీసుకోవాలని అన్నారు. సింగరేణి స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి , ఇంటి నెంబర్ ల కేటాయింపుకు , ముటేషన్ కు ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలని 37 వ డివిజన్ కార్పొరేటర్ పెంట రాజేష్ కోరారు . దీనిపై కమిషనర్ సుమన్ రావు వివరణ ఇస్తూ జి ఓ 58 ప్రకారం స్థలాలు క్రమబద్దీకరించడానికి సర్వే జరుగుతుందని , ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఇక ఇబ్బందులు వుండవని అన్నారు . కార్పొరేటర్ మందల కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ విగ్రహం నగర పాలక సంస్థ తరపున ఏర్పాటు చేయాలని కోరారు . విగ్రహాల ఏర్పాటుపై నిషేధం వుందని మేయర్ తెలిపారు. అలాగే జరగని పనులకు కూడా బిల్లులు పెట్టారని కిషన్ రెడ్డి ఆరోపించగా ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే బిల్లుల చెల్లింపు నిలిపివేయడంతో పాటు సంబందిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని మేయర్ అన్నారు.
..ఈ సమావేశంలో నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు , కమిషనర్ సుమన్ రావు , కార్పొరేటర్లు , కో ఆప్షన్ సభ్యులు ,అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.