సైబర్ నేరం జరగగానే తక్షణమే జాతీయ హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయండి!

ప్రస్తుతం ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌ల యుగం నడుస్తోందని, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే మోసపోతారని కొత్త కొత్త పద్ధతులతో సైబర్‌ నేరాలు జరుగుతున్నాయని, ఓటీపీ, సీవీవీ, బ్యాంక్‌ వివరాలు ఇతరులకు చెప్పవద్దని రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. గుర్తింపు లేని ఆన్‌లైన్ యాప్‌ల వలకు చిక్కి.. అప్పులు తీర్చలేక కొందరు ప్రాణాలు తీసుకుంటుంటే… మరికొందరు తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తున్నవారు. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు సామాన్యులు… జల్సాలకి అలవాటు పడి, వ్యసనాలకి బానిసై కొందరు యువత ఈ లోన్ యాప్ ఊబిలో చిక్కి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులను యుట్యూబ్ ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో యాడ్ ల ద్వారా కూడా లోన్స్ తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు.. ఆ వలలో పడి మోసపోకండి. రుణ యాప్‌ల్లో చాలా వరకు ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధగా ఉన్నాయని, ఆర్బీఐ వద్ద నమోదు కాని యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవొద్దని రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్ చంద్ర శేఖర్ రెడ్డి ఐపిఎస్(ఐజి) గారు సూచించారు. ఇన్‌స్టెంట్‌ లోన్ల పేరుతో నమ్మించే యాప్‌ల్ని నమ్మి మోసపోవద్దని, ఆ యాప్‌ల నుంచి ఇప్పటికే రుణాలు పొందినవారు వేధింపులకు గురైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆధార్‌, బ్యాంకు ఖాతా వివరాలు ఎట్టిపరిస్థితుల్లో ఎవరికి ఇవ్వరాదని, లోన్ యాప్ ల వలన ఫోన్ లోని వ్యక్తిగత, విలువైన సమాచారం, ఫోన్‌ కాంటాక్ట్స్‌, ఫోటోలు తీసుకుని ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. యాప్‌ల ద్వారా అందించే రుణాల వడ్డీ రోజుకు ఒక శాతం వరకు ఉంటుంది. ఇది సాధారణంగా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ రిజిస్ట్రర్‌ అయిన సంస్థలు అందించే రుణ వడ్డీల కన్నా చాలా ఎక్కువ. సకాలంలో చెల్లించకపోతే వడ్డీ 2, 3 రెట్లు ఎక్కువగా వసూలు చేస్తారు. లోన్ యాప్‌ల బెదిరింపులు, నోటీసులకు బాధితులు భయపడకుండా ధైర్యంగా ఉండాలని, మిత్రులు, బంధువులకు సమస్య గురించి వివరించాలన్నారు. వేధింపులకి గురి చేస్తున్నట్లు ఆధారాలను సేకరించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం మంచిదన్నారు. అపరిచితుల ఫోన్ కాల్స్, సంబంధం లేని మెసేజ్ లింకులు తెరిచి.. చిక్కుల్లో పడుతున్నారు. బాధితుల్లో ఎక్కవ విద్యావంతులు ఉంటున్నారు. అవగాహన ఉన్న వారు తక్షణం స్పందించి పోలీసులు లేదా హెల్ప్ లైన్ నంబర్లకు సంప్రదిస్తున్నారు. ఆన్లైన్ మోసాలపై ఒకప్పటితో పోల్చితే ప్రజలకు కొంత అవగాహన పెరిగింది. పోలీసుల, హెల్ప్ లైన్ నంబరు సేవలు వినియోగించుకుంటున్నారు*రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ మధ్యకాలంలో రిపోర్ట్ అయిన కొన్ని కేసుల వివరాలు…*1. చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన ఒక బాధితుడికి లోన్ గురించి ఒక మెసేజ్ వచ్చింది బాధితుడు ఆ మెసేజ్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయగానే FAST COIN అని లోన్ అప్లికేషన్ డౌన్ లోడ్ అయింది, బాధితుడు అప్లికేషన్ లో తన వివరాలు మొత్తం నమోదు చేసి లోన్ తీసుకున్నాడు, మరలా లోన్ డబ్బులు మొత్తం తిరిగి చెల్లించిన అప్పటికిని వారికి అమౌంట్ రిసీవ్ అవ్వలేదు అని మరలా పంపించాలి లేకపోతే మీ స్నేహితులకు బంధువులకు కాల్ చేస్తాం అంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.2. ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన ఒక బాధితుడు ఇంస్టాగ్రామ్ చూస్తున్నప్పుడు. ఒక లోన్ అప్లికేషన్ గురించి యాడ్ వచ్చింది బాధితుడు ఆడ్ ని క్లిక్ చేసి EULAVT అనే లోన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని Rs.4000 తీసుకున్నాడు, వడ్డీతో కలిపి Rs.7000 లోన్ అమౌంట్ తిరిగి చెల్లించిన అప్పటికిని వాళ్లకు రిసీవ్ కాలేదు మరలా తిరిగి చెల్లించాలి లేకపోతే మీ స్నేహితులకు బంధువులకు కాల్ చేస్తామని ఇబ్బందులకు గురి చేస్తున్నారు3. మంథని పోలీస్స్టేషన్ పరిధి చెందిన ఒక బాధితుడు యూట్యూబ్ చూస్తున్నప్పుడు లోన్ గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది బాధితుడు అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేసి దాని కింద ఉన్న లింక్ ద్వారా FL LOAN అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుని లోన్ కోసం అప్లై చేశాడు, సైబర్ నేరగాళ్లు మీకు 30 వేల లోన్ అమౌంట్ సాంక్షన్ అయ్యింది ఆ అమౌంట్ పొందాలి అంటే మూడు వేల రూపాయలు చెల్లించాలి అని చెప్పగా బాధితుడు చెల్లించాడు, ఆ తరువాత ఇదే విధంగా పలు రకాల కారణాలు చెప్పి మొత్తం తొమ్మిది వేల రూపాయలు ముందే చెల్లించుకున్నారు.. ఆ తరువాత బాధితుడు యొక్క నెంబరు బ్లాక్ లో పెట్టేశారు4. రామగుండం పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన ఒక బాధితుడు CASHEE LOAN అనే అప్లికేషన్లు లోన్ తీసుకుని తిరిగి చెల్లించి నప్పటికీ ని, మా అప్లికేషన్ లో అప్డేట్ అవ్వలేదు మీరు మరలా చెల్లించాలి అంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బసంత్ నగర్ మరియు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా కొంత మంది బాధితులు ఇలాగే loan app ద్వారా మోసపోయారు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *