ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై సిఐడి కేసు నమోదు!

ఆంధ్రజ్యోతి_ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణపై సీఐడీ అధికారులు కేసు నమోదుచేశారు. ఈ నెల 10న హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నవనిర్మాణ నగర్ లోని విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు చేస్తున్నప్పుడు రాధాకృష్ణ. మరికొందరు అక్కడికి చేరుకుని తమ విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐడీ విభాగం రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయంలో ఇన్ స్పెక్టర్గా పనిచేస్తున్న జీవీవీ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై మంగళగిరిలోని సీఐడీ ప్రధాన పోలీసు స్టేషన్లో జీరో ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీలోని 353, 341, 186, 120బీ రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు పెట్టారు. న్యాయవాది జీవీజీ నాయుడు, ఏబీఎన్ వీడియోగ్రాఫర్ ఎన్. రమేష్, ఏబీఎన్ రిపోర్టింగ్ ఏజెంట్ సోమపల్లి చక్రవర్తి రాజును నిందితులుగా పేర్కొన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *