జిల్లా అధికార ప్రతినిదిగా బెంద్రం రాజిరెడ్డి నియామకం..
గోదావరిఖని-: 39వ డివిజన్ శాంతి నగర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బెంద్రం రాజిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిదిగా నియామిస్తు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన మాజీ మంత్రివర్యులు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ గారికి, కాల్వ లింగస్వామి గారికి, ఎం రవికుమార్ గారికి, బొంతల రాజేశ్ గారికి, మహంకాళి స్వామి గారికి, మరియు కార్పోరేటర్లకు తదితరులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు.