ప్రభుత్వ పాఠశాలల్లో కార్పోరేట్ తరహా విద్య బోధన..!
తెలంగాణ విద్యావ్యవస్థ ను దేశానికే ఆదర్శంగా నిలుపాలన్నదే సి.ఎం కేసీఆర్ గారి లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం రామగుండం కార్పోరేషన్ పరిధిలోని 8 వ డివిజన్ లో ఉర్దూ మీడియం పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని మాట్లాడారు. 9 లక్షల విద్యాశాఖ నిధులతో పాఠశాల ఆవరణలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు. పేద కుటుంబాల విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో కార్పోరేట్ తరహా ఆంగ్ల విద్యను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. సీఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం లోని ప్రభుత్వ పాఠశాల్లో కార్పొరేట్ స్థాయి విద్యతో పాఠశాల్లో మౌళిక వసుతుల కల్పన పాఠశాల లకు అవసరం అయున అభివృద్ధి కార్యక్రమాలు చెపట్టడం జరిగుతుందన్నారు.రాష్ర్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి కార్పొరేట్ విద్యాలయాలకు ధీటుగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సర్వమఖఅభివృద్ది సిఎం గారు అహర్నిషలు పాటుపడుతున్నరని అన్నారు. రాష్ర్టంలోని ప్రతి విద్యార్ధి ఉన్నతంగా ఎదగడానికి సీఎం కెసిఆర్ సంకల్ప ఫలితమే ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల వసతులను ఏర్పాటు చేయడమన్నారు..జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల అభివృధి, అహ్లాదహక్రమైన వాతావరణంలో మెరుగైన విద్య అందించడమే ధ్యేయంగా కార్యాచరణ రూపొందించినట్టు పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గం లోని ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు సి.ఎం కేసీఆర్ గారిని ఓప్పించి మెడికల్ కళశాల ఎర్పాటు చేస్తున్నమన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, మండల విధ్యాధికారి దాసరి లక్ష్మి కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్,ఇంజపురి పులిందర్, మున్సిపల్ అధికారులు డిప్యూటీ కమిషనర్ నారాయణ రావు ఈ ఈ మాధవి అబ్దుల్ పాఠశాల అధ్యాపకులు ,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.