రామగుండం లో ఇక తైబజార్!
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని మార్కెట్ల నుండి తై బజార్ వసూలు చేసుకొను హక్కులు అప్పగించుటకుఈ నెల 19 వ తేదీ ఉదయం 11 గంటలకు మునిసిపల్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు కమీషనర్ బి.సుమన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరిఖని, ఎన్ టి పి సి, రామగుండం,8 ఇంక్ లైన్ కాలనీ,గౌతమి నగర్ మార్కెట్ లతో పాటు పశువధ శాల ఫీజులు వసూలు చేసుకొను హక్కులు అప్పగించుటకు వేర్వేరుగా వేలం నిర్వహించడం జరుగుతుo దని తెలిపారు. వేలంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు ఈ నెల 17 వతేదీ సాయంత్రం 5 గంటల లోపు నిర్ణీత ధరావత్తు చెల్లించాలని ఆయన కోరారు.మరిన్ని వివరాలకు మునిసిపల్ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన తెలిపారు.