బీ అర్ ఎస్ ను ఓడించండి!
..గడప గడప కు హస్తం.
..అభివృద్ధి కావాలంటే బి అర్ ఎస్ ను ఒడించాలి.
పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్………….!
పేదల పార్టీ కాంగ్రెస్ అని పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మాక్కాన్ సింగ్ అన్నారు.ఆయన పట్టణం లోని 41,27 డివిజన్ ల లో బుధవారం జరిగిన హత్ సే హత్ జొడో యాత్ర కార్యక్రమం లోపాల్గొని,గడపగడపలోని ప్రతీ ఒక్కరినీ కలుస్తూ, వారితో మాట్లాడుతూ ..గడిచిన ఎనిమిదేండ్లలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ, సామాన్యుల నడ్డి విరిచే పన్నులు వసూలు చేస్తూ, ప్రభుత్వ ఆదాయాన్ని అంబానీ, అధానీలకు దొచిపెడుతున్నాయని, అదేవిదంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ స్ ప్రభుత్వం కూడా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను కేవలం అధికారం చేపట్టడం కోసమే అని అన్నారు. ప్రజలకు, రైతులకు, నిరుద్యోగ యువతకు పెద్దగా ప్రయోజనం లేదని, అదేవిదంగా ఇక్కడి శాసనసభ్యుడు కేవలం ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలనే అందిస్తున్నారు తప్ప, నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు తీసుకొచ్చిన దాఖలాలు లేనేలేవన్నారు. అధికార పార్టీ అండదండలతో కార్పోరేషన్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అభివృద్ది నిరోధకంగా మారారని,రామగుండం నియోజవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటేకాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, అధికారంలోకి వచ్చిన వెంటనే వరంగల్ రైతు డిక్లెరేషన్ ను పూర్తి స్థాయిలో అమలు పరచి, రైతును ,రైతు కూలీలను రాజులుగా చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య లక్ష్యమని అన్నారు…….
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఫజల్ బేగ్, కల్వల రంజిత్, కార్పొరేటర్ గాధం విజయానంద్, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, ఎండీ ముస్తఫా, పెద్దెళ్లి తేజస్వి ప్రకాష్, మాజీ కార్పొరేటర్ మారెళ్లి రాజిరెడ్డి, బొమ్మక రాజేష్, బీసీ విభాగం అధ్యక్షులు గట్ల రమేష్, సెల్ అద్యక్షులు తాల్లపెళ్లి యుగేందర్, సీనియర్ నాయకులు మేకల పొషం, ఆడెపు దశరథం, తిప్పరపు శ్రీనివాస్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధూళికట్ట సతీష్, కీర్తి నాగరాజు, యువజన విభాగం నాయకులు కౌటం సతీష్, నాజీమ్, సిరిషెట్టి సతీష్, దాసరి విజయ్, మెంతం ఉదయ్ రాజ్, సయ్యద్ కమ్మర్ పాషా, మీర్జా రహమత్ ఆలి బేగ్,కమ్మగిరి సంపత్, అబ్బుబాకర్, హరేందర్, కమర్ పాష, నురుద్దిన్, షఫి, దొబ్బల శ్రీనివాస్, అన్సర్, శ్రీకాంత్ , అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు..