గొంతులో గరళం..!
ప్రజలకు మురికి నీరే గతి•
ప్రశ్నార్థకంగా ప్రజారోగ్యం.
అర్జీ 1 సింగరేణి అధికారుల నిర్లక్ష్యం సిగ్గు చేటు.
ఖని లో దుస్థితి ఇదీ.
ప్రత్యేక ప్రతినిధి, దర్వాజ :..గరళాన్ని తలపించే ఇక్కడి కుళాయి నీళ్లు తాగాలంటే ప్రజలు హడలిపోతున్నారు. గోదావరి లో సరైన శుదీకరణ లేకపోవడం,తాగునీటి పైపుల లీకేజీలు, మ్యాన్ హోల్స్ లోని వాల్వుల వద్ద చేరుతున్న మురుగు నీరు.. వెరసి ఖని కి కలుషితమైననీరు సరఫరా అవుతోంది. అలాగే మంచినీటి పైప్ లైన్లుడ్రెయినేజీల్లో ఉండటంతో పాటు కొన్ని ప్రాంతాల్లోపైపులకు ఉన్న లీకేజీల కారణంగా మురుగునీరుతాగునీటిలో కలసి సరఫరా అవుతోంది. దీంతో ఖని లోని సింగరేణి కార్మికులు ,కార్మికేతర కుటుంబాలకు ,ఈ కలుషిత నీరే దిక్కవుతోంది.
అయినా అధికారులు,పాలకులుపూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడంతో ఇప్పుడు ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్థకంగామారింది.కార్మిక క్షేత్రమైన గోదావరిఖనిపరిధిలో నగర వాసులకుకొంతకాలంగాదుర్వాసన వెదజల్లుతున్నమురుగు నీరే కుళాయిల ద్వారా అందుతోంది…దీనిపై స్థానికులు కొందరు సోమవారం వారం సైతం అధికారులకుఫిర్యాదు చేశారు. ఇక్కడి సింగరేణి అధికారులు సరఫరా చేసే నీటిని తాగడం మాట పక్కనబెడితే కనీసంవాడుకకు కూడా పనికిరావడం లేదు. గోదావరి వద్ద సింగరేణి అధికారులు ఏర్పాటు చేసిన యంత్రాలు సరిగ్గా పని చేయకపోవడం ,సరైన రీతిలో నీటి శుద్దీకరణ చేయకపోవడం,డ్రెయినేజీల్లోనిమురుగు నీరు, మలమూత్రాలు పైప్ లైన్లలోకి చేరికుళాయిల ద్వారా ప్రజలకుసరఫరా అవుతున్నాయి.
ఈవిషయాన్ని పలుమార్లు పాలకులు, సింగరేణి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య తీరటంలేదని స్థానికులువాపోతున్నారు. కొన్నాళ్లుగా నగరం లో ని సింగరేణి కార్మికులు నివసించే పరిసర ప్రాంతాలకు అందుతున్న నీరు మరింత అధ్వానంగా ఉంది. ఈ నీటిని చేత్తో ముట్టుకోవడానికి కూడా అసహ్యం కలుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల తాము రోగాల పాలవుతున్నామని, అలాగే పలువురు అధికారులు కనీసం స్వచ్ఛమైన నీటిని అందించలేకపోతే ఎలా ?అని వారు ప్రశ్నిస్తున్నారు.చర్మ వ్యాధులు వస్తున్నట్లుచెబుతున్నారు. …..వాడుకకూ కూడా ..మినరల్ వాటరే దిక్కా?……..నగరం లోని నీటి కాలుష్యం కారణంగా దాదాపు 75 శాతంకుళాయిల ద్వారా సరఫరా అయ్యే నీటిని వాడుకకు వినియోగించటం లేదు.75 శాతం మందికి పైగా ప్రజలు మినరల్ వాటర్నే తాగుతున్నారు. సింగరేణి పంపిణీ చేస్తున్న నీటిని వినియోగిస్తుంటే చర్మరోగాలు ప్రబలుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. వాడుకకు కూడా నీరు కొనాలంటే ఎలా.. తాగునీటిని అందిస్తామని ప్రగల్భాలు పలికే పాలకులు ఈఅంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన నీటి వినియోగిస్తే తెలుస్తుందని ప్రజలుధ్వజమెత్తుతున్నారు. ఇప్పటికైనా పాలకులు,ఉన్నతాధికారులు స్పందించి కలుషిత మంచినీటిసమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు……..