ఇద్దరు నిందితుల అరెస్టు..
ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల ను అరెస్టు చేసి వివరాలని రామగుండం సిఐ చంద్రశేఖర్ గౌడ్, ఎస్సై జీవన్ లతో కలిసి బుధవారం వెల్లడించారు…అన్నపూర్ణ కాలనీలో ఒక ఇంట్లో, కృష్ణ నగర్ లోని రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి మల్లయ్య ఇంట్లో దొంగతనం చేసిన బంగారం, వెండి ని అమ్మడం కోసం నిందితుడు సందీప్ వెండి వస్తువులను మోటార్ సైకిల్ కవర్లో పెట్టుకొని అన్నపూర్ణ కాలనీ లోని సంతోస్ వద్దకు వచ్చి ,సంతోష్ ని తీసుకుని అమ్మడానికి గోదావరిఖని వైపు వెళ్తుండగా అందిన సమాచారం మేరకు ఎస్సై జీవన్ , సిబ్బందితో కలిసి నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి పల్సర్ మోటార్ సైకిల్, 08 తులాల బంగారం , 150 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు… నిందితుడు గుమ్మల సందీప్ బెస్త పల్లి సిరిపురం గ్రామ నివాసి. ప్రస్తుతం ప్రశాంత్ నగర్ గోదావరిఖనిలో నివాసం ఉంటు సెంట్రింగ్ మేషన్ పని చేస్తూ, తన స్నేహితుడైన బోరె సంతోష్ … ప్రస్తుతం అన్నపూర్ణ కాలనీ ఎన్టిఫిసి లో సెంట్రింగ్ పని చేస్తూ కూలి పనులకు వచ్చే డబ్బులు సరిపోక, జల్సాలకు అలవాటు పడి డబ్బులు సరిపోక సులభంగా డబ్బులు సంపాదించాలని రాత్రి సమయంలో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు సెంట్రింగ్ పనులు చేసుకుంటూ సాయంత్రం సమయంలో నిందితుడు సందీప్… పల్సర్ బైక్పై తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి తిరిగి రాత్రి సమయంలో కూడా తాళం వేసి ఉంటే అట్టి ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే వారు.
దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై జీవన్ సిబ్బందిని సీఐ గారు రివార్డుతో అభినందించడం జరిగింది….