ఆరిఫ్ సేవలు భేష్..!

దర్వాజ :/ కంటి చూపు ప్రసాదించడాని.. మరణించిన వారి నేత్రాలను సేకరించి, వాటిని ఐ బ్యాంక్ కు తరలిస్తున్న గోదావరిఖనికి చెందిన షేక్ ఆరిఫ్ టెక్నీషియన్ సేవలు భేష్ అని లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్లు రేకులపల్లి విజయ, మినేష్ నారాయణ్ తండాన్, ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి కొనియాడారు. గురువారం రాత్రి గోదావరిఖని శారదా నగర్ లోని రెడ్డి భవన్ లో జరిగిన రామగుండం లయన్స్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణోత్సవంలో టెక్నీషియన్ ఆరిఫ్ ను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. ఆరిఫ్ గత 10 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ ద్వారా నేత్రాలను సేకరించడానికి ఉత్తమ టెక్నీషియన్ గా సేవలను అందిస్తుండడం అభినందనియని కొనియాడారు. ప్రతీ ఒక్కరు నేత్రదానం చేసేలా ఆరిఫ్ అవగాహన కల్పిస్తున్నారని, లయన్స్ క్లబ్ ఆరిఫ్ సేవలను సద్వినియోగం చేసుకుంటుందని తెలిపారు. కజాంపురం రాజేందర్, పి.మల్లికార్జున్, ఎల్లప్ప, తిలక్ చక్రవర్తి, బెణిగోపాల్ త్రివేది, తానిపర్తి గోపాల రావు, విజయలక్ష్మి పాల్గొన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *