ప్రాణహిత పుష్కరాల ఏర్పాట్ల పరిశీలన!
హైదరాబాద్ ,ఏప్రిల్ 14, (దర్వాజ) 14నుంచి ఈనెల నేటి నుంచి ఈనెల 24 వరకు తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రాణహిత పుష్కరాలను పురస్కరించుకొని, అర్జున్ గుట్ట లో రామగుండం పోలీస్ కమిషనరేట్ జైపూర్ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. అర్జున్ గుట్ట వద్ద వద్ద భద్రతా ఏర్పాట్లతో పాటు, పుష్కర ఘాట్లు,పార్కింగ్ స్థలాలు, చెక్ పోస్ట్ లను రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తనిఖీ చేశారు. ప్రాణహిత పుష్కరాలలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ గారు పేర్కొన్నారు. భక్తులు పోలీసుల సూచనలు తప్పక పాటించాలని, అలాగే నది స్నానం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలన్నారు. పుష్కర స్నానం కోసం వచ్చే విఐపి, వివిఐపి భక్తుల కోసం సమర్థవంతమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. పుష్కరాల సమయంలో భక్తులతో పోలీసు అధికారులు, సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని, క్రమశిక్షణ, ఓపికతో ప్రవర్తించి, పోలీసు శాఖ ప్రతిష్ట పెంచాలని, పోలీసు అధికారులు సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ ఐపిఎస్, జైపూర్ ఏసీపీ నరేందర్,సీఐ చెన్నూర్ రూరల్ నాగరాజు, సీఐ శ్రీరాంపూర్ రాజు పాల్గొన్నారు.