పెట్రోల్ రూపాయికే?
రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు అయితే మరీ దారుణం! ఇదిలా ఉండగా.. రూపాయికే లీటర్ పెట్రోల్ ఇస్తామన్న ప్రకటనతో వందలాది మంది వాహనదారులు పెట్రోల్ బంక్‌కు క్యూ కట్టారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, గురువారం బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోలాపూర్‌లోని ఓ పెట్రోల్ బంక్ ఓనర్.. రూపాయికే లీటర్ పెట్రోల్ అని 500 మందికి పెట్రోల్ఇచ్చారు. దీంతో ఆఫర్ విషయం తెలుసుకున్న వాహనదారులు బంక్ వద్ద క్యూ కట్టారు. భారీ సంఖ్యలో వచ్చిన వాహనదారులకు కట్టడి చేసేందుకు చివరకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది…..