సింగరేణి లో ప్రమాదం.. అధికారి మృతి!
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ & ప్రాజెక్ట్ ఆఫీసర్మందమర్రి: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కల్యాణిఖని ఉపరితల గనిలో జరిగిన ప్రమాదంలో ఓ అధికారి మృతిచెందారు. రెండున్న గంటలకు జరిగిన ప్రమాదంలో అండర్ మేనేజర్గా పనిచేస్తున్న పురుషోత్తంపై బొగ్గు పెల్లలు పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. రామకృష్ణాపూర్ సింగరేణి ఆస్పత్రికి తీసుకెళ్తున్న క్రమంలో పురుషోత్తం మరణించారు. ఘటనా స్థలాన్ని మందమర్రి జీఎం చింతల శ్రీనివాస్ తో పాటు అధికారులు పరిశీలించారు.