మద్యం దుకాణాల రాబడి ‘ఫుల్’

తెలంగాణలో నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆఖరి రోజైన ఇవాళ రాత్రి 7 గంటల వరకు దాదాపు 60 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ దరఖాస్తుల ద్వారా అబ్కారీ శాఖకు ఇప్పటివరకు రూ.1200 కోట్లకు పైగా రాబడి చేకూరినట్లు అయింది. కాగా, మొత్తం దరఖాస్తుల్లో ఇవాళ ఒక్కరోజే 30వేల పైగా దరఖాస్తులను అబ్కారీ శాఖ స్వీకరించింది. ఈ నెల 20న డ్రా ద్వారా దుకాణాలను కేటాయించనుండగా.. దుకాణాల సంఖ్య 2,620కి పెరిగిన సంగతి తెలిసిందే.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *