మానవాళి పాపపరిహార్థమే క్రీస్తు శిలువ మరణం..
మరణిస్తూ ప్రేమను పంచిన కరుణామయుడు…
గుడ్ ఫ్రైడే వేడుకలలో పాస్టర్ డిలైట్…
గోదావరిఖని, ఏప్రిల్ 15, దర్వాజ:మానవాళి పాప పరి హారార్ధమే క్రీస్తు శిలువ మరణమని పాస్టర్ డిలైట్ అన్నారు. గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని శుక్రవారం పట్టణంలోని 7బి కాలనీలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్వితీయుడు ప్రేమా మూర్తి క్రీస్తు అని, విశ్వాసకులకు గుర్తు చేశారు. ప్రజల అతి క్రమ క్రియలను పట్టే క్రీస్తు గాయపడ్డాడని, దోషములను బట్టి నలుగగొట్టబడ్డాడని, సమాధానార్ధమైన శిక్ష క్రీస్తు పొంది ఉన్నాడని, క్రీస్తు పొందిన దెబ్బలచేత మానవాళికి పాప క్షమాపణ అన్నారు..మొదటి మాటతో క్షమాపణ ను, రెండవ మాటతో పరలో కార్ధా న్ని, మూడవ మాటలో తల్లిదండ్రుల పట్ల బాధ్య తా యుత ప్రేమను, నాలుగవ మాటలో చేయివిడుచుట అనే అర్ధాన్ని, ఐదవ మాటలో దప్పికొనుచున్నాను అనే శారీరక, ఆత్మీయ అర్ధాన్ని, ఆరవ మాటలో తాను ఈ లోకానికి వచ్చి న పని పూర్తయిందనే సందేశాన్ని, ఏడవ మాటలో అప్ప గించుకొనుచున్నాను నా ఆత్మను అనే బాధ్యతాయుతమైన కర్తవ్యాన్ని బోధించాడని అన్నారు….. అంతకుముందు బేతేలు దర్శన సంఘ క్వాయిర్ పాడిన పాటలు పలువురిని అలరించాయి. అనంతరం ఉప వాసంతో వచ్చిన విశ్వాసకు మజ్జిగను అందజేశారు. ..
.ఈ కార్యక్రమంలో సిస్టర్ సోనీ ప్రజ్వల, జీవన్ రెడ్డి, రాజ్ కుమార్, నూతన్, ప్రేమ్ సాగర్, జోనాతన్…. విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.