ఉత్పాదకత పై సమీక్షా సమావేశం!
ఈ రోజు ఆర్జీ-1 జియం కార్యలయం నందు ఆర్జీ-1 లోని అన్ని గనుల ఏజంట్స్,మేనేజర్స్, అధికారులతో ఆర్జీ-1 జియం కె. నారాయణ ..ఉత్పత్తి మరియు ఉత్పాదకత, రక్షణ విషయాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా జియం గారు మాట్లడుతూ ఆర్జీ-1 ఏరియాకు ఈ ఆర్థిక సంవత్సరం సింగరేణి సంస్థ 74 మిలియన్ టన్నుల లక్ష్యం నిర్థెశించుకోవటం జరిగింది. ఆర్ జి 1 ఏరియాకు 38,20,000 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను నిర్థెషించుకోవటం జరిగింది.మనకు నిర్థెశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని, ఉత్పత్తి పెంపునకు తీసుకోవలసిన ప్రణాళికల, ఓవర్ బర్డెన్ తరలింపు గురించి చర్చించారు . గనులలో తీసుకోవాల్సిన రక్షణ చర్యల గురించి దిశా నిర్దేశం చేశారు . నెలవారి సాధించాల్సిన ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాల గురించి తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 100 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రతి ఒక్క కార్మికుడికి అవగాహన కల్పించి సంస్థను అభివృద్ధి పథంలో నడిపించే దిశగా కష్టపడి పనిచేయాలని వారు తెలియజేశారు… రక్షణ విషయం లో రామగుండం ఇల్లందు క్లబ్ ప్రభాత్ కుమార్ , ఇన్స్పెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ డీజీఎంఎస్ సింగరేణి లో రక్షణ పై అవగాహణ సదస్సు నిర్వహించి రక్షణ పై పలు అంశాలను తెలిపారు. అదే విధంగా గనులలో ప్రమాదాలు జరుగకుండా తీసుకోవలసిన జాగ్రత్త చర్యల పై అవగాహణ కల్పించారు.ప్రతి ఒక్క ఉద్యోగు రక్షణ పై అవహాగానా ఉండాలని తెలిపారు.అలాగే రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమములో జీడికే 5 ఓసీ పిఓ సత్యనారాయణ , ఏజెంట్ శ్రీనాథ్ , డీజీఎం ఏరియా వర్క్ షాప్ మధన్ మోహన్ , డీజీఎం ఐఈడి ఆంజనేయులు , డీజీఎం క్వాలిటీ సలీం , పర్చేస్ అధికారి శ్రీనివాస్ , మేనేజర్స్ దాసరి శ్రీనివాసు ,నెహ్రూ , రమేశ్ బాబు , గోవిందరావు , అనిల్ గబలే , సుధీర్ తదితరులు పాల్గోన్నారు. ….