ఘనంగా వాకర్స్ అసోసియేషన్ వార్షికోత్సవ వేడుకలు….!

గోదావరిఖని పట్టణంలో ని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు దాసరి రఘు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, పోలీస్, వ్యాపార, రాజకీయనాయకుల,ఇతర ప్రభుత్వ ఉద్యోగులు మరియు వర్గాల తో ఏర్పడిన గోదావరి వాకర్స్ అసోసియేషన్ 3 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శారీరక ఆరోగ్యం తో పాటుగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని, మానసిక ఆరోగ్యం మిత్రులు శ్రేయోభిలాషుల ద్వారా మాత్రమే సాధ్యమని ఈ గ్రూప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. 10 మంది తో ప్రారంభం అయినటువంటి ఈ గ్రూప్ ఈ రోజు 100 మంది సభ్యులతో గోదావరి వాకింగ్ అసోసియేషన్ గా అభివృద్ధి చెందిందని తెలిపారు.. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయిన 1టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు …. మాట్లాడుతూ విభిన్న వృత్తుల లో ఉన్న వారు ఒక వాకర్స్ అసోసియేషన్ గా ఏర్పడి వ్యాయామాల ద్వారా ఆరోగాన్ని పెంపొందించుకొవడమే కాకుండా అందరూ ఒక కుటుంబం లా కలసి కష్టాల్లో ఉన్నవారికి సహాయ సహకారాలు అందిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉత్తమ వాకర్స్ అసోసియేషన్ గా పేరు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 3వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సింగరేణి క్రీడాకారుడు పైడాకుల సంపత్ ని ఉత్తమ వాకర్ అవార్డు తో మరియు అసోసియేషన్ లో సభ్యులు అయినటువంటి న్యాలం సదయ్య, ఓరుగంటి సదయ్య, జంపయ్య, సురేందర్ లకు హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి పొందిన సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. …ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు కార్పొరేటర్లు అడ్డాల రామస్వామి, మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాష్, గెజిటెడ్ హెచ్ఎం సంపత్ రావు , బోయిని మల్లేష్ యాదవ్, మామిడి సత్యనారాయణ, చింతకింది కృష్ణ , దీటి శ్రీనివాస్, జక్కం శ్రీనివాస్, చెన్నూరి వేణు, బుర్ర శ్రీనివాస్ గౌడ్, జనహిత పూర్మ శ్రీనివాస్, నాయిని మధునయ్య, మాటూరి సురేష్, ఇర్ల రమేష్, గసికంటి రమేష్, మెతుకు దేవరాజు గారు… శ్రీహరి, భరత్, కృష్ణ తో పాటుగా సుమారు 100 మంది సభ్యులు పాల్గొనడం జరిగింది.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *