ఆన్లైన్ మోసాల్లో అప్రమత్తత ఆవశ్యకం….
“సైబర్ నేరం జరిగిన వెంటనే NCRP portal (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేయడం బాధితులకు ఉన్న ఒకే ఒక్క గొప్ప ఆయుధం”: సిపి రామగుండం**టోల్ ఫ్రీ నెంబర్లు 155260, డయల్ 100, 112 లకు కాల్ చేయండి.* తక్కువ ధరకే వాహనం.. సత్వరం రుణం, ఆరోగ్యకార్డులు అందిస్తాం.. రూ. కోట్ల విలువైన లక్కీ లాటరీ మీకే..! ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగం.. పాన్ కార్డ్ KYC నవీకరిస్తాం.. బ్యాంకు ఖాతా, ఓటీపీ చెబితే చాలు..!! అని కూపీ లాగుతున్న ఆన్ లైన్ (సైబర్) నేరగాళ్లు సామాన్యులను మోసం చేస్తున్నారు.బ్యాంకు ప్రతినిధిగా మాటలు కలుపుతూ సొమ్ము కాజేస్తున్నారు. కళ్లు మూసి తెరిచే లోపల మోసాలు పెరుగు తున్న ప్రస్తుత తరుణంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏమాత్రం ఏమరపాటు వహించినా మొదటికే మోసం వస్తుంది. అని సీపీ గారు అన్నారు.*రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ వారం రోజుల వ్యవధి లో రిపోర్ట్ అయిన కొన్ని కేసుల వివరాలు…*1. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన ఒక బాధితుడికి సైబర్ నేరగాడు కాల్ చేసి నీకు లక్ష రూపాయలు శాంక్షన్ అయింది, లోన్ పొందాలి అనుకుంటే ప్రాసెసింగ్ ఫీజు కోసం Rs.1500 పంపాలి అనగా బాధితుడు పంపాడు. ఆ తరువాత GST కోసం, ఇన్సూరెన్స్ కోసం, TDS కోసం అంటూ పలు కారణాలు చెప్పి Rs. 42 వేలు మోసం చేశాడు.*తీసుకోవాల్సిన జాగ్రత్త:-* ఎవరైనా కాల్ చేసి మీకు లోన్ శాంక్షన్ అయింది లోన్ అమౌంట్ పొందాలి అంటే కొన్ని రకాల ఫీజు చెల్లించాలి అంటే, వారు మిమ్మల్ని మోసం చేస్తున్నట్లు గ్రహించండి.2.మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన ఒక బాధితుడు ఫేస్ బుక్ లో SBI BANK CUSTOMER SERVICE POINT డీలర్ షిప్ గురించి ఒక ఆడ్ చూసి తన మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. సైబర్ నేరగాళ్లు బాధితుడు కి కాల్ చేసి మీకు డీలర్ షిప్ కావాలి అంటే రిజిస్ట్రేషన్ చార్జి కోసం Rs. 12 వేలు పంపాలి అనగా పంపించాడు. ఆ తరువాత GST మరియు TDS అంటూ పలు కారణాలు చెప్పి Rs. 85 వేలు మోసం చేశాడు*తీసుకోవాల్సిన జాగ్రత్త:-* Face book, Instagram ఇంకా ఏదైనా ఇతర సామాజిక మాధ్యమాలలో వచ్చే Add లను చూసి మోసపోకండి.3.మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన ఒక బాధితుడు తన స్నేహితుడికి PAY TM ద్వారా డబ్బులు పంపించాడు కానీ అవి సెండ్ అవ్వలేదు. ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని గూగుల్ లో PAY TM యొక్క కస్టమర్ కేర్ నెంబర్ వెతికి కాల్ చేయగా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ (సైబర్ నేరగాడు) మీ సమస్య పరిష్కారం అవ్వాలి అంటే ANY DESK అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోండి అని చెప్పగా బాధితుడు చేసుకుని యాక్సిస్ ఐడి ని కూడా సైబర్ నేరగాడికి చెప్పాడు. ఆ తరువాత ATM కార్డు డీటెయిల్స్ కూడా చెప్పేశారు. ANY DESK అప్లికేషన్ ద్వారా అతనికి వచ్చిన OTP లు చూసి Rs. 9 వేలు మోసం చేశాడు. ఇదే పద్ధతిలో గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన మరొక బాధితుడు Rs. 67 వేలు మోసపోయాడు.*తీసుకోవాల్సిన జాగ్రత్త:-* కస్టమర్ కేర్ నెంబర్ కోసం గూగుల్ లో వెతక వద్దు, ఆ సంబంధిత అప్లికేషన్ లోనే నెంబర్ ఉంటుంది. ఎవరైనా ANY DESK అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోండి అని చెబితే వారు మిమ్మల్ని మోసం చేస్తున్నట్లే గ్రహించండి4.మంచిర్యాల పోలీసు స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడికి ఫోన్ పే క్యాష్ రివార్డ్ అంటూ గూగుల్ లో ఒక స్క్రాచ్ కార్డు నోటిఫికేషన్ ద్వారా వచ్చింది.. బాధితుడు ఆ స్క్రాచ్ కార్డ్ ని స్క్రాచ్ చేసి కింద SEND MONEY TO ACCOUNT అనే బటన్ ప్రెస్ చేయగా ఫోన్ పే ఓపెన్ అయింది. ఫోన్ పే MPIN ఎంటర్ చేయగా బాధితుడి అకౌంట్ నుంచి RS. 880/- పోయాయి. ఇదే పద్ధతిలో చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరో బాధితుడు Rs. 816/- మోసపోయాడు.తీసుకోవాల్సిన జాగ్రత్త:- గూగుల్ నోటిఫికేషన్ ద్వారా వచ్చే క్యాష్ రివార్డులు, స్క్రాచ్ కార్డ్ లని నమ్మకండి, డబ్బులు ఎవ్వరూ ఊరికే ఇవ్వరు.5.పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడికి SBI YONO లో PAN CARD డీటెయిల్స్ అప్డేట్ చేయండి లేకపోతే మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది అంటూ మెసేజ్ వచ్చింది. బాధితుడు ఆ మెసేజ్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయగా SBI ONLINE BANKING ఓపెన్ అయింది బాధితుడు ఆన్-లైన్ బ్యాంకింగ్ లోకి లాగిన్ అయి తన మొబైల్ కి వచ్చిన OTP ని కూడా చేశాడు వెంటనే, బాధితుడి అకౌంట్ నుంచి RS. 5 వేలు పోయాయి.*తీసుకోవాల్సిన జాగ్రత్త:-* PAN CARD LINK చేయండి లేదా Aadar CARD LINK చేయండి అంటూ ఎవరైనా మెసేజ్ లు పంపితే అందులో ఉండే లింకులను క్లిక్ చేయండి. బ్యాంకు వారు మీకు ఎటువంటి లింక్ లను పంపరు6.జన్నారం పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన ఒక బాధితుడికి సైబర్ నేరగాడు కాల్ చేసి మేము బజాజ్ ఫైనాన్స్ నుంచి కాల్ చేస్తున్నాను మీకు లక్ష రూపాయలు శాంక్షన్ అయింది, లోన్ పొందాలి అనుకుంటే ప్రాసెసింగ్ ఫీజు కోసం Rs.1500 పంపాలి అనగా బాధితుడు పంపాడు. ఆ తరువాత GST కోసం, ఇన్సూరెన్స్ కోసం అంటూ పలు కారణాలు చెప్పి Rs. 18 వేలు మోసం చేశాడు. మరల TDS కోసం Rs. 16 వేలు పంపాలి అంటూ వల విసురుతున్నారు.*తీసుకోవాల్సిన జాగ్రత్త:-* ఎవరైనా కాల్ చేసి మీకు లోన్ శాంక్షన్ అయింది లోన్ అమౌంట్ పొందాలి అంటే కొన్ని రకాల ఫీజు చెల్లించాలి అంటే, వారు మిమ్మల్ని మోసం చేస్తున్నట్లు గ్రహించండి.7.ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన ఒక బాధితుడికి ఒక పోస్ట్ వచ్చింది. బాధితుడు ఆ పోస్టు ఓపెన్ చేయగా అందులో Rs.7 లక్షల 50 వేలు గెలుచుకున్న ట్లు అమెజాన్ గిఫ్ట్ కూపన్ ఉంది. బాధితుడు ఆ కూపన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయగా సైబర్ నేరగాళ్లు మీకు ఆ గిఫ్ట్ అమౌంట్ రావాలి అంటే ప్రాసెసింగ్ ఫీజు కోసం Rs. 7. వేలు, GST కోసం 22 వేలు ఇలా పలు కారణాలు చెప్పి RS. 1 లక్ష 60 వేలు మోసం చేశాడు.*తీసుకోవాల్సిన జాగ్రత్త:-* NAAPTOL/ AMAZON లేదా ఏదైనా నా ఇతర కంపెనీల నుంచి గిఫ్ట్ కూపన్ అంటూ పోస్ట్ లు వచ్చిన కాల్స్ కి రెస్పాండ్ అవ్వకండి.8.గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన ఒక బాధితురాలికి సైబర్ నేరగాడు కాల్ చేసి మీ SBI YONO ACCOUNT బ్లాక్ అవుతుంది అవ్వకుండా ఉండాలంటే SWON (SPACE) ECOM (LAST 4 DIGITS OF ATM NO.) టైపు చేసి 09223966666 నెంబర్ కి మెసేజ్ చేయాలి అనగా బాధితురాలు చేసింది, వెంటనే బాధితురాలు ఎకౌంట్ నుంచి RS. 22 వేలు కట్ అయినాయి.*తీసుకోవాల్సిన జాగ్రత్త:-* PAN CARD LINK చేయండి లేదా Aadar CARD LINK చేయండి అంటూ ఎవరైనా మెసేజ్ లు పంపితే అందులో ఉండే లింకులను క్లిక్ చేయండి. బ్యాంకు వారు మీకు ఎటువంటి లింక్ లను పంపరు